ఏ.పీ. జెఎసి రాష్ట్ర సంఘం కార్యాచరణలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం తాలూకా యూనిట్ ఏ.పీ. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు ఎన్జీవో హోం లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు మాట్లాడుతూ 12 వ పిఆర్సి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఐ.ఆర్(iR) ను వెంటనే ప్రకటించాలని, సిపిఎస్ ను వెంటనే అమలు చేయాలని ధర్నా లో డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి నిరసన తెలిపి అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం లో ఏ.పీ.జేఏసీ అధ్యక్షులు మార్కాపురం తాలూకా యూనిట్ ఉద్యోగ సంఘాల నాయకులు, పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
prakasam district news
Babu Surety – Guarantee for future :
కందుకూరు పట్టణం 3 వ వార్డు దుర్గమ్మ గుడి ఏరియాలో బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ నాయకులు సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని, దుర్మార్గపు పాలనకు ముగింపు పలకాలంటే, రాబోయే ఎన్నికల్లో టిడిపిని బలపరచాలని నాగేశ్వరరావు కోరారు. వార్డులో ప్రధానంగా సైడ్ కాలవలు, రోడ్ల నిర్మాణం గురించి స్థానికులు పదేపదే ప్రస్తావించారు. వైసిపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారని, పరిపాలన దారుణంగా ఉందని మహిళలు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు వార్డులో కలియ తిరుగుతూ, చిన్నా పెద్దా అందరిని పలకరిస్తూ, సమస్యలు తెలుసుకున్నారు. ఈసారి తమ ఓటు తెలుగుదేశం పార్టీకేనని స్పష్టంగా చెప్పిన మహిళలు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షులు పువ్వాడి కోటయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆ ఇద్దరి దెబ్బకు ప్రధాన పార్టీలు నిలిచే పరిస్థితి లేదు. గతంలో ఇద్దరూ ప్రత్యర్థులే. అప్పటినుంచి ఆగర్భ శత్రువులుగా కొనసాగుతున్నారు. ఒకే పార్టీలో ఉన్నా వేర్వేరు పంథాలో ప్రాభవం నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఇద్దరూ స్వతంత్రులుగా తలపడేందుకు సన్నద్ధమయ్యారు. మరి ప్రధాన పార్టీల స్థానం ఎలా వుండబోతోంది… సదరు ఇండిపెండెంట్ల ప్రభావం ఏ స్థాయిలో వుంటుంది.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం ఎజెండాగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ నుండి పాదయాత్ర మొదలుపెట్టి నియోజకవర్గంలోని ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యత మరియు మార్కాపురం జిల్లా ఆవశ్యకత గురించి వివరిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ పాదయాత్రలో కలిసి వచ్చే పార్టీలను అన్నింటిని కలుపుకొని ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సమ సమాజ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ సామాజిక మహా శిల్ప విగ్రహావిష్కరణ మహోత్సవానికి తరలివస్తున్న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం జనవాహన అందరికీ తాటిపర్తి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని విధంగా సమసమాజ నిర్మాణ ఘట్టానికి పూనుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన కొని ఆడారు. మంచి సూపర్ పాలన అందించాలంటే మరల ముఖ్యమంత్రిని గెలిపించుకోవాలంటూ ఆయన జోష్యం చెప్పారు. మహోత్సవ విగ్రహావిష్కరణలో పాల్గొని ప్రతి ఒక్కరు జగనన్న సైనికులుగా అడుగులో అడుగు వేస్తూ జయప్రదం చేయాలంటూ ఆయన కోరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో చేసిన వాగ్దానాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, జీతాలు పెంచాలని, గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న మొండి వైఖరి విడనాడాలని సిపిఐ నాయకులు అందే నాసరయ్య అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వంట వార్పు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం 26 వేల రూపాయలకు పెంచాలని, మున్సిపల్ కార్మికులకు అపస్తృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గత 13 రోజులుగా చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడాలని తెలుపుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్కే కాసిం, ఏఐటీయూసీ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఇడుపూరు గ్రామానికి చెందిన దళిత మహిళ కొండ్రు నాగమ్మకు న్యాయం చేయాలని కోరుతూ దళిత సంఘ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు నాగయ్య మాట్లాడుతూ మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామంలో దళిత మహిళ కొండ్రు నాగమ్మ భర్త చనిపోవడంతో జీవనాధారమైన పూర్వీకుల కాలం నాటి మూడెకరాల 88 సెంట్ల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుందని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం తన ఆరోగ్యం బాగాలేక ఆ పొలాన్ని ఖాళీగా ఉంచారని ఇదే క్రమంలో ఇడుపూరు గ్రామానికి చెందిన వల్ల రాజు యాదవ్ తన భూమిని ఆక్రమించుకోక అడిగిన మహిళపై దాడి కూడా చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం పొలంలో పంట వేసుకుంటే ఆక్రమించిన వ్యక్తి దున్నివేయడంతో దళిత మహిళకు 60 వేల రూపాయలు నష్టం కూడా వాటిల్లిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నారు. దళిత ఎస్సి అసైన్మెంట్ భూముల కబ్జాదారులకు మద్దతుగా నిలిచిన మార్కాపురం ఎమ్మార్వో మంజునాథరెడ్డి, వీఆర్వో బడే సాహెబ్, వీఆర్ఏ నాసర్ లపై చట్ట ప్రకారం విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు కొండ్రు నాగమ్మ, దళిత సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఉలవపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం నందు శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటుచేసి 10 గంటల నుండి శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఇదేవిధంగా ఉలవపాడు గ్రామంలో వేంచేసియున్న కనకదుర్గమ్మ ఆలయం, కోదండ రామస్వామి ఆలయం, నీలకంఠేశ్వర స్వామి ఆలయం, వేరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తులు భక్తిశ్రద్ధలతోఈ ఆలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులకు ఆలయాల్లో తీర్థప్రసాదాలు అందజేశారు.
గిద్దలూరు మండలం దిగువ మెట్ట అటవీ ప్రాంతంలోని బెల్లం పాక ఏరియాలో కణితిని వేటాడి చంపిన కేసులో ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు గుండ్లకమ్మ రేంజ్ ఆఫీసర్ హెచ్. జీవన్ కుమార్ తెలిపారు. దిగువ మెట్ట అటవీ ప్రాంతంలో కణితిని వేటాడి మాంసం తీసుకుని వస్తున్నారని సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు శుక్రవారం వేకువ జామున హౌస్ బ్రిడ్జి సమీపంలో కాపు కాశారు. ఆ సమయంలో మోటార్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు మాంసం తీసుకుని వస్తుండగా వారిని పట్టుకుని విచారించారు. వారు ఇద్దరే కాకుండా మరో ముగ్గురు వేటాడినట్లు నిందితులు తెలిపారు. నిందితులు తెలిపిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి గాలింపు చేపట్టగా అక్కడ ఉన్న ఒక నాటు తుపాకీనీ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో దిగువ మెట్టకు చెందిన మీనగా యశ్వంత్, గండు లక్ష్మి లను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడిలో దిగువ మెట్ట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ డి. వంశీకృష్ణ, ఎఫ్ బి ఓ లుడి.చేజర్లయ్య, ఉమాదేవి లు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం ఎమ్మేల్యే మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గ మార్పును వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో నియోజకవర్గ నాయకులు సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు మంత్రి సురేష్ కు చెందిన జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో సమావేశమయ్యారు. కొత్తగా వచ్చే నాయకులను తాము సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సురేష్ కు ఇది పట్టున్న నియోజకవర్గమని ఆయన్ని మారిస్తే ఓటమి తథ్యమన్నారు. వారంతా సమావేశమైన సమయంలో మంత్రి సురేష్ కళాశాలలోనే ఉన్నారు.




Total views : 214664