శ్రీశైలంలో వచ్చేనెల 6 నుంచి 10 వరకు 5 రోజులపాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి శ్రీశైల ఆలయ ఈవో పెద్దిరాజు దేవస్థానం పరిపాలన భవనంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొదటగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసినందుకు దేవస్థానం అధికారులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలను సమర్థవంతంగా జరిగేలా సిబ్బంది అంతా కృషి చేయాలన్నారు. ఉగాది మహోత్సవాల ఏర్పాట్లకు సంబందించిన అంశాలను చర్చించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు జారీచేశారు. అధికారులందరు పరస్పర సమన్వయంతో ఉత్సవాలను ఎటువంటి లోటు పాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అదేవిధంగా క్షేత్రానికి వారం రోజుల ముందు నుండే కర్ణాటక, మహారాష్ట్ర కన్నడ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని, పాదయాత్ర మార్గంలో విచ్చేసే కన్నడ భక్తులకు భీమునికొలను కైలాసద్వారం అలానే అటవీ మార్గంలో వేయి లీటర్ల సింటెక్స్ ట్యాంకులు 8 ఏర్పాటు చేయాలని కన్నడ భక్తులకు ఎంటుంటి అసౌకర్యం కలగకుండా నీటి కోసం ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అలానే క్షేత్రపరిదిలో భక్తులకు అవసరమైన తాత్కాలిక వసతి, త్రాగునీరు, విశ్రాంతి సెమియనలు ఏర్పాట్లు చేయాలని కన్నడ భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిదిలో పలు సమాచార కేంద్రాలు, కన్నడ భాషలో సూచిక బోర్డ్స్ పెట్టాలన్నారు. ఉగాది మహోత్సవాల ఏర్పాట్లన్ని ఈనెల 29 లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు.
శ్రీశైలంలో వచ్చేనెల ఉగాది మహోత్సవాలు…
72
previous post