అయ్యా.. లోకేష్ బాబు ఒక్కసారి ఆలోచించండి
గ్రామాల్లో తలెత్తుకుని తిరగలేకున్నాం
వైసిపి హయాంలో ఆదిమూలం పెట్టించిన అక్రమ కేసుల విషయమై ఇప్పటికీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం
తెదేపా తరపున ఆదిమూలం పోటీచేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడు.. ఓడిస్తాం
తెదేపా నియోజకవర్గ మహిళా అధ్యక్ష్యురాలు వరలక్ష్మీ యాదవ్
తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ సారి సార్వత్రిక ఎన్నికల బరిలో సత్యవేడు నియోజకవర్గ స్థానం నుండి వైసిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పోటీచేయునున్నట్లు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ఈ నేపధ్యంలో సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల పరిధిలో పలువురు ఆదిమూలం తెదేపా అభ్యర్థి గా ప్రకటించడం సరికాదనే నిరసనలు తెలియజేశారు. ఈ క్రమంలోనే తెదేపా నియోజకవర్గ మహిళా అధ్యక్ష్యురాలు వరలక్ష్మీ యాదవ్ కేవిబిపురం మండల కేంద్రంలో ఆదిమూలం అభ్యర్థిత్వంపై అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ నాయకులతో నిరసన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ అధిష్టానం సత్యవేడు అభ్యర్థిగా ఆదిమూలం ను ప్రకటించడం సరైన నిర్ణయం కాదన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అధినేత చంద్రబాబు, నారాలోకేష్ లు ఈ అంశంపై పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. లోకేష్ పర్యటనలో రెడ్ గ్రూపు మెయిన్ టెన్ చేసి సమస్యలు సేకరించారు, అందులో ఏం సమస్యలను గుర్తించారు. ఆపైల్ ను చించేశారా అంటూ నిలదీశారు. అయ్యా లోకేష్ బాబు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ గ్రామాల్లో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఉంది, వైసిపి వాళ్ళు ఫోన్ లు చేసి మా నాయకుడు మీ నాయకుడు అయ్యాడు ఈసారి గెలిచేది వైసిపి నే, మా మీటింగ్ లకు రండి, బస్సులు పెట్టాము అంటూ టిడిపి లీడర్లను పిలుస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చదవండి : నిర్లక్ష్యానికి మారుపేరు గా మారిన మున్సిపల్ అధికారులు…
సర్వే చేసిన వారు కనిపిస్తే కొడతాం
తెదేపా అభ్యర్థి ఎంపిక విషయంలో సర్వే చేసిన వాళ్ళు కనిపిస్తే కొడతామని వరలక్ష్మీ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి హయాంలో ఎమ్మెల్యే ఆదిమూలం గ్రామాల్లో తమపై పెట్టించిన అక్రమ కేసుల్లో ఇప్పటికీ పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతున్నామని అన్నారు. ఏవిధంగా సర్వే జరిగింది, ఎందుకు ఆదిమూలంకు టిక్కెట్ ఇచ్చారు, అసలు ఆదిమూలంకి తెదేపా సభ్యత్వం ఉందా..? పోనీ వైసిపిలో పదవికి రాజీనామా చేశారా..? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా పార్టీ అధిష్టానం, సత్యవేడు అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకుని, తెదేపా సొంతిగూటి నుంచి ఉన్న వారిలో ఎవరు ఎన్నికల బరిలో నిలబడినా గెలుస్తామన్నారు. ఆదిమూలం నే అభ్యర్థిగా కొనసాగిస్తే ఖచ్చితంగా ఓడిపోతాడని ఆమె పేర్కోన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి