రామ్ గోపాలవర్మ ఒక డైరెక్టర్. వైసిపి వాళ్ళు డబ్బులు ఇస్తే వ్యూహం సినిమా తీశాడు. డబ్బులిచ్చారు కాబట్టి వైసిపిపై ఆర్.జి.వి. కి సానుభూతి ఉంటుంది. సినిమాలు చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయి. వ్యూహం సినిమా నేను చూస్తాను. వెంటనే వైసిపి కి వ్యతిరేకంగా సినిమా తీస్తాను. రఘురామకృష్ణంరాజుపై చిత్ర హింసలు,వివేకానందరెడ్డి మర్డర్ ఎలా జరిగింది, వైసిపి అరాచకాలపై నేను సినిమాలు తీసి సమాధానం చెబుతా. వివేకానంద మర్డర్ ఎందుకు చేశారో చెప్పలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉంది. సినీ పరిశ్రమ మొత్తం టిడిపి వైపు ఉంది. సినీ రంగo భయంతో ఉంది. త్వరలో టిడిపికి మద్దతుగా అందరూ వస్తారు. రాష్ట్ర ప్రజల బాగు కోసం నేను టిడిపిని సపోర్ట్ చేస్తున్నా. చంద్రబాబుని త్వరలో కలిసి నా ప్రత్యక్ష రాజకీయాలపై కార్యచరణ ప్రకటిస్తా. విశాఖలో సినీ రంగానికి ప్రభుత్వ స్టూడియో నిర్మాణం కావాలని లోకేష్ గారిని అడిగాను. సినిమా హబ్ గా విశాఖను తీసుకువస్తాం. టిడిపి,జనసేనకి 130నుంచి 150 సీట్లు వస్తాయి. వైసిపి 23 సీట్లకు పరిమితం అవుతుంది అని ఆయన తెలిపారు.
Vishakapattanam
అల్లూరి జిల్లా హుకుంపేట లో సాకలిగెడ్డ వద్ద కు చేపలు పట్టడానికి వచ్చిన గిరిజనుడు ప్రమాదవశాత్తు గెడ్డలో పడి గల్లంతయ్యాడు. హుకుంపేట మండలం బారపల్లి గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపలు వేటకు వచ్చారు .దురదృష్టవశాత్తు బోనంగి రవికుమార్ (32) గెడ్డలో చేపలు పడుతుండగా సాయంత్రం 4.30 సమయంలో ఊబిలోకూరుకుపోయి గల్లంతయ్యాడు. వారితోనే చేపలు వేటకు వచ్చిన వంజలి శంకర్, కిలో రామారావు, కీల్లో సంతోష్ , గెడ్డలో గల్లంతైన రవికుమార్ బయటకు రకపోయే సరికి స్థానిక పోలీసులకు సమాచారం వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి గల్లంతైన గిరిజనుడి ని గజ ఈత గళ్ళ సహాయంతో గాలిస్తున్నారు. హైవే నిర్మాణం లో భాగంగా వంతెన నిర్మాణం అవుతున్న క్రమంలో గెడ్డ మధ్యలో 3 గొట్టాలు వేసి తాత్కాలికంగా చిన్న వంతెన నిర్మించారు. తాత్కాలిక వంతెన వెయ్యడం వాళ్ళ ఇక్కడ గెడ్డలో నీరు నిల్వ వుండటం వల్ల ఊబి గా తయారైందని కొందరుబాధితులు ఆరోపిస్తున్నారు.
విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వంశీకృష్ణ యాదవ్ కు జనసేనాని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. జనసేన పార్టీలోకి రావడంతో పార్టీ మారినట్టుగా అనిపించడంలేదు. సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోందని వంశీకృష్ణ వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానిగానే ఉన్నానని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో, విశాఖలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు, పవన్ కల్యాణ్ ను సీఎంగా చేసేందుకు సర్వశక్తులు ధారపోస్తాను అని తెలిపారు. వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి రావడం పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు. వంశీకృష్ణ యాదవ్ చాలా బలమైన నాయకుడు అని కొనియాడారు. స్వల్ప తేడాతో విశాఖ తూర్పు నుంచి ఓడిపోయి, మళ్లీ ఎమ్మెల్సీగా గెలిచారని వివరించారు. ఇప్పుడాయనకు సొంత కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
విశాఖ, స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముట్టడికి కార్మిక సంఘాలు ఐక్యతా కార్యాచరణ పేరిట పిలుపునిచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్దకు చేరుకున్న వేలాది కార్మికులు మరియు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ గేటు వద్ద పెద్ద ఎత్తున జిందాల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి తమ సర్వశక్తులు ఒడ్డి పోరాటానికి సిద్ధంగా కార్మికులు ఉన్నారని నాయకులు తెలిపారు. జిందాల్ తో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని వెంటనే కార్మిక సంఘాలకు బహిర్గతం చేయకుంటే అడ్మినిస్ట్రేషన్ ను ముట్టడిస్తామంటూ కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
విశాఖ వైసీపీ కి మరో భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని విశాఖ ఎంపీగా లేదా గాజువాక ఎమ్మెల్యేగా పోటీచేయాలని హైకమాండ్ ఆదేశించింది. అయితే వంశీకృష్ణ ఎంపీగా పోటీ చేయనని తేల్చి చెప్పారు. యాదవ సామాజిక వర్గంలో కీలకనేతగా ఉన్న వంశీకృష్ణ పార్టీ మారే యోచనలో ఉన్నాడు. భీమిలో జనసేన – టీడీపీ అభ్యర్థిగా వంశీకృష్ణ పోటీ చేయవచ్చని భావిస్తున్నారు.
ఉదయం 7:30 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాలాకి బిజెపి శ్రేణులు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 1 -00 గంటకు కేంద్ర పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, ముత్యశాఖ మంత్రివర్యులు పురుషోత్తం రూపాలా గారి చేతుల మీదుగా స్వర్గీయ. ఆడారి తులసి రావు కాంస్య విగ్రహాన్ని విశాఖ డైరీ ప్రాంగణము నందు ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 1: 45 గంటలకు షీలా నగర్ లోని విశాఖ డైరీ ట్రస్ట్ హాస్పిటల్ నందు క్యాన్సర్ బ్లాకును కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాలా చేతుల మీదగా ప్రారంభించెదరు. మధ్యాహ్నం 2.00 పాల ఉత్పత్తిదారులు ఆత్మీయ కలియక జరగనున్నది.
అల్లూరి జిల్లా పాడేరులో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది. చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదారుల్లో ముందు ఏం ఉందో కనిపించడం లేదు. దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. చలి పులి పంజా విసరడంతో విశాఖ ఏజెన్సీ వణికిపోతోంది. పాడేరులో పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. మిచౌంగ్ తుఫాన్ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలితో గజగజా వణికిపోతూనే ఉంది. తాజాగా చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. ఎంత పొద్దెక్కినా సూర్యుడు కనిపించకపోగా, మంచు దుప్పటి కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు నానా ఇక్కట్లు పడుతున్నారు. పాడేరులో పగలైనా సరే, వాహనం బయటకు తియ్యాలంటే లైట్లు ఆన్ చెయ్యాల్సిందే. ఇక ముంచంగిపుట్టులో చలి తీవ్రతకు జనం చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. క్రమంగా ఉష్ణోగ్రతలు దిగజారుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవుతోంది. దీంతో కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ముంచంగిపుట్టు, హుకుంపేట, పెదబయులు, జి మడుగుల మండలాల పరిధిలో గత మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం పూట పది గంటల వరకు హుకుంపేట లో మంచు తెరలు వీడడం లేదు. చలికి జనం గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల తరువాత వీధుల్లో చలి మంటలు దర్శనమిస్తున్నాయి.
విశాఖ జిల్లా మధురవాడలో కేటుగాళ్లు ఫుట్ పాత్లను ఆక్రమిస్తున్నారు. యదేశ్చగా రోడ్డు ప్రక్కన అక్రమంగా బడ్డీలు పెడుతున్నారు. జగన్ ఫోటోలతో బోర్డులు పెట్టి లక్షల్లో అద్దెలను వసూలు రాజాలు వసూలు చేస్తున్నారు. నేనే రాజు, నేనే మంత్రి అంటు రమణమూర్తి కన్నింగ్ గ్యాంగ్ రెచ్చిపోతున్నారు. బడ్డీలపై మానమ్మకం నువ్వే జగన్ అనే బోర్డులు పెట్టి రమణమూర్తి అధికారులను బెదిరిస్తున్నారు. మధురువాడలో రోడ్డు ప్రక్కన ఉన్న పుట్ పాత్లపై రోజుకొకటిగా అక్రమ బడ్డీలు వెలుస్తున్నాయి. రమణమూర్తి పైరవీలకు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తలొగ్గుతున్నారు. షాపు పేర్లు ఉన్న బోర్డులను తొలగించి ప్రతీ బడ్డీపైనా అక్రమంగా జగన్ ఫోటోతో కూడిన బోర్డులను ఏర్పాటుచేస్తున్నారు. మా బడ్డీపై బోర్డులు పెట్టొద్దన్న కొంతమంది బడ్డీ యజమానులపై దౌర్జన్యం చేస్తున్నారు. అక్రమంగా సీఎం జగన్ ఫోటో తో బోర్డులు పెట్టి ప్రభుత్వ భూములకు ఎసరు పెడుతున్నారు.
అల్లూరి జిల్లా.. వాహనాలు తనీఖీ లో భాగంగా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు కిలోల 227 గ్రాముల లిక్విడ్ గంజాయిని, 23 లక్షల 50 వేల రూపాయలు నగదును, ఓలంగి రాజారావు అనే వ్యక్తిని పట్టుకొవడం జరిగింది. ఇతను జి మాడుగుల మండలం అలగాం గ్రామంనకు చెందినవాడు. ఓలంగి రాజారావు చాలా రోజుల నుంచి ఈ లిక్విడ్ గంజాయి వ్యాపారానికి అలవాటు పడ్డాడు. రెండు మూడు సంవత్సరాల క్రితం తమిళనాడు నుండి కొంతమంది వచ్చి లిక్విడ్ గంజాయి తయారు చేయడం నెర్పారు. అక్కడ నుండి లిక్వడ్ తయారుచేసే మిషన్ తీసుకురావడం జరిగింది. చుట్టుపక్కల ఒరిస్సా ప్రాంతాము నుండి గంజాయి సేకరించి లిక్విడ్ గంజాయి తయారు చేయడం నేర్చుకున్నాడు. ఇతను దగ్గర నుండి లిక్విడ్ గంజాయి, 23లక్షల 50 వేలు నగదు, వెయింగి మిషన్, లిక్విడ్ తయారుచేసే మిషను, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నాము.
Read Also..





Total views : 92849