పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం వ్యక్తిగత ఆరోపణలు దూషణలతో రాసాభాసగా మారింది. మున్సిపల్ ఛైర్ పర్సన్ వెంకటరమణ అధ్యక్షతన ప్రారంభం అయిన బడ్జెట్ సమావేశంలో.. బడ్జెట్ మొత్తం అంకెల గారెడీ తప్ప కొత్త విషయాలు గాని, పట్టణాభివృద్ధికి బడ్జెట్ లో కేటాయింపులు గానీ లేవని స్వతంత్ర కౌన్సిలర్, మాజీ ఛైర్పర్సన్ భర్త కోటిపల్లి సురేష్ విమర్శించారు. దాంతో అధికార కౌన్సిలర్లు రాజు, సురేష్ లు కోటిపల్లి సురేష్ పై ద్వజమెత్తారు. మున్సిపాలిటీ చరిత్ర లో చైర్ పర్సన్ కోటిపల్లి పద్మ ఒక్కరే బాగా లబ్ది పొందారని విమర్శిచారు. తన భార్య హయాంలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని కౌన్సిలర్ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. నరసాపురం మున్సిపల్ భవనం నిర్మాణానికి అప్పటి నియోజకవర్గ ఇంచార్జ్ ప్రసాదరాజు కృషి చేసారని అధికార కౌన్సిలర్లు అనడంతో.. తమ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ద్వారా నిధులు తెచ్చి నిర్మించామే తప్ప ప్రసాదరాజుకు సంబంధం లేదని కౌన్సిలర్ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నిధులు తీసుకువచ్చారని వైస్ చైర్మన్ కొత్తపల్లి నానీ అనడంతో కౌన్సిల్ సమావేశం రాసాభాసగా మారి వ్యక్తిగత ఆరోపణలు ప్రత్యారోపణలతో దద్దరిల్లింది.
రసాభాసగా మారిన మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం..
69
previous post