అడవిలో ఉండవలసిన క్రూర మృగాలు జనసంచారంలోకి రావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పులి వ్యవసాయ పొలాల్లో సంచరిస్తుందని వదంతులు షికారు చేసిన నేపథ్యంలో అటు అటవీశాఖ అధికారులకు, ఇటు రైతులకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. గత వారం రోజులుగా ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయిగూడెం మండలంలోని అటవీ సరిహద్దు ప్రాంతాలలో ఒక పులి సంచరిస్తూ రైతుల కంట పడినట్లు ఆరోపిస్తున్నారు. అక్కడ పంట పొలాల్లో పులి జాడలను చూసిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అదే విధంగా నల్లజర్ల మండలం పుల్లల పాడు, దెందులూరు మండలం పెరుగు గూడెం గ్రామాల్లో కూడా పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులుకు తెలుపడం తో ఆ మూడు ప్రాంతాలలో అటవీ శాఖ అధికారులు పర్యటించి పులి జాడలను కనుగొని స్థానిక గ్రామస్తులను అప్రమత్తం చేశారు. పంట పొలాల్లో పులి సంచరిస్తుందన్న విషయం తెలుసుకున్న రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలన్న, వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లాలన్న భయాందోలనలకు గురవుతున్నారు. అయితే పెరుగు గూడెంలో పులి సంచరించిందని పొలాల్లో పులి జాడలు చూపిస్తూ “అదుగో పులి” ఇదుగో పులి అంటూ రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
జనసంచారంలోకి క్రూర మృగాలు..
59
previous post