ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) సతీమణి వైఎస్ భారతి రెడ్డి(YS Bharathi Reddy)కి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. వేంపల్లిలో ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహిస్తుండగా కుమ్మరం పల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పట్టాదారు పాస్ పుస్తకం వైస్ జగన్ ఫొటో ఉండటాన్ని తప్పుపట్టారు. వైసీపీ నాయకుడు కుమ్మరాంపల్లి భాస్కర్ రెడ్డి పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫొటో లేకుండా చూడాలని..వైయస్ భారతి రెడ్డిని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి సమావేశంలో నా ఎస్సీ.. నా బిసి.. నా మైనారిటీ అంటున్నారే కానీ.. ఒక్కసారి కూడా నా రైతన్న అని అనడం లేదని ఆయన వైఎస్ భారతీరెడ్డి వద్ద అన్నారు. రైతు భరోసా కింద ఇస్తున్న 16 వేలు రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని… నగదు మొత్తాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని భాస్కర్ రెడ్డి సూచించారు. అందుకు వైఎస్ భారతి సానుకూలంగా స్పందించారు.
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.