వైఎస్సార్ కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల, విజయమ్మల మధ్య ఆస్తుల వార్ మొదలైంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సతీమణి వైఎస్ భారతి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. వైఎస్ జగన్ తరఫున వై సూర్యనారాయణ కంపెనీల యాక్ట్ 59 కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించి.. తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఎన్సీఎల్టీ ఈ పిటిషన్‌కు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తన సోదరిపై అప్యాయతతో షర్మిలకు మొదట్లో వాటాలు కేటాయించాలని భావించామన్నారు జగన్. అయితే ఇటీవల రాజకీయంగా ఆమె తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ ఆఫర్‌ను విరమించుకున్నట్లు పిటిషన్లో ప్రస్తావించారు. ఈ కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నాయని, తన సోదరి, తల్లి షేర్ల బదిలీని రద్దు చేయాలని NCPLT ని జగన్ అభ్యర్థించారు. వారిద్దరికి వాటాలు ఇవ్వదల్చుకోలేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోన్న క్యాబినెట్ సమావేశంముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మొత్తం 13 అంశాలపై ప్రధాన ఎజెండాగా కేబీనెట్ సమావేశం జరుగుతోంది. దీపావళి కానుకగా దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. అర్హులైన…
- రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.ఉక్రెయిన్ వివాదానికి వీలైనంత త్వరగా,…
- హైదరాబాద్ లో భారీగా పెరిగిన చికెన్ ధరలుఆదివారం వచ్చిందంటే నాన్‌వెజ్ ప్రియులకు పండగే. మార్కెట్లో చేపలు, చికెన్, మటన్ షాపులు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతాయి. అయితే తాజాగా అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో భారీగా…
- కేటీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదుబండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని , తనను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, రేవంత్ తో కలిసిపోయానన్న వ్యాఖ్యలను నిరూపించాలన్నారు. లేదంటే…
- వైఎస్ కుటుంబంలో మరోసారి భగ్గుమన్న విబేధాలువైఎస్సార్ కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల, విజయమ్మల మధ్య ఆస్తుల వార్ మొదలైంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సతీమణి వైఎస్ భారతి నేషనల్ కంపెనీ లా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి