వైఎస్సార్ కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల, విజయమ్మల మధ్య ఆస్తుల వార్ మొదలైంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సతీమణి వైఎస్ భారతి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. వైఎస్ జగన్ తరఫున వై సూర్యనారాయణ కంపెనీల యాక్ట్ 59 కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించి.. తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఎన్సీఎల్టీ ఈ పిటిషన్‌కు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తన సోదరిపై అప్యాయతతో షర్మిలకు మొదట్లో వాటాలు కేటాయించాలని భావించామన్నారు జగన్. అయితే ఇటీవల రాజకీయంగా ఆమె తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ ఆఫర్‌ను విరమించుకున్నట్లు పిటిషన్లో ప్రస్తావించారు. ఈ కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నాయని, తన సోదరి, తల్లి షేర్ల బదిలీని రద్దు చేయాలని NCPLT ని జగన్ అభ్యర్థించారు. వారిద్దరికి వాటాలు ఇవ్వదల్చుకోలేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
- అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్.అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
- విమానంలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన సచిన్… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
- ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్లో బలమైన ఆరంభం.ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం 1 వికెట్…
- దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్‌లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 141308