యేసుక్రీస్తు కు వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్లు..

anganwadi

Advertisements

&NewLine;<p>అంగన్వాడీ టీచర్ల&comma; ఆయాల సమస్యలు పరిష్కరించాలని గత 13 రోజులుగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా చేస్తున్న నిరసన సమ్మె సోమవారం 14వ రోజుకు చేరింది&period; సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు&comma; ఆయాలు యేసుప్రభు చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు&period; ఏపీ సీఎం జగన్ మనసు మార్చి మా జీతాలు పెంచేలా చూడాలని యేసుప్రభుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు&period; అనంతరం కేక్ కట్ చేశారు&period; ఈ సందర్భంగా సిఐటియు నాయకులు&comma; అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని&comma; కనీసం రూ&period;26&comma;000 గౌరవ వేతనం ఇవ్వాలని&comma; ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు&period; గత 13 రోజులుగా అంగన్వాడి టీచర్లు నిరసన సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని వారు ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై మండిపడ్డారు&period; తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని&comma; లేనిపక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు&period; ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు&comma; ఆయాలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్