77
తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు సమ్మె బాట పట్టారు. ముమ్మిడివరం ఐ.సి.డి.ఎస్.కార్యాలయం వద్ధ ఆందోళనకు పూనుకున్నారు. ఎన్నికల ముందర హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక తమ గోడు పట్టని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డారు. కనీస సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోక పోవడంతో ,సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన వీడేదిలేదని నినాదాలు చేస్తున్నారు. ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, అయినవిల్లి మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, హెల్ఫర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.