అంగన్వాడీల సమ్మె ఆందోళన 5వరోజుకు చేరింది. ఈరోజు ఉలవపాడు ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడిలు కళ్ళకు గంతల కట్టుకొని నల్ల చీరలు ధరించి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోకుండా అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం చేయకుండా బెదిరింపులతో ఉద్యమాన్ని అణచాలనుకోవడం ఆయన నియంత్రత్వ పాలనకు నిదర్శనం అని అన్నారు. సచివాలయ వాలంటీర్లు సిబ్బంది చేత బలవంతంగా తాళాలు పగలగొట్టి సెంటర్లు తెరిపించడం అంటే తన ఆస్తులను తనే ధ్వంసం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాళాల మీద కొట్టే ప్రతి దెబ్బ రాబోయే కాలంలో సమ్మెట్టు పోటుల్లాగా ఆయన మీదనే ఆ దెబ్బలు తగులుతాయి అనేది గుర్తించుకోవాలని అన్నారు. వెంటనే అంగన్వాడీలను చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షురాలు వాకా.లతా రెడ్డి ప్రాజెక్టు సెక్టార్ లీడర్లు ఎస్.కె పద్మజ, బీ.మార్తమ్మ ,సిహెచ్ పద్మజ ,పర్రె తిరుపతమ్మ, కృష్ణకుమారి ,ప్రసన్న, కామాక్షి, పద్మ ,డి రమాదేవి, పొంతగాని రమణ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలు ఆట పాటలతో ధర్నా శిబిరంలో డాన్సులతో ఆకట్టుకున్నారు. కోలాటం ప్రదర్శించారు ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియాలో ….అది పేదలపాటి జెండాఎన్నియాలో… అని నృత్యం చేశారు. శైలజ, డి వరలక్ష్మి, సిహెచ్ కోటేశ్వరి కసుకుర్తి కోటేశ్వరి, శివలీల, మాంచాలి, శ్రీదేవి తదితరులు కళారూపాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సి. హెచ్. ఇందిరావతి, పద్మజ లతా రెడ్డి పద్మజ ప్రవీణ గీత అమీరున్నీసా తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీలకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలి..
76
previous post