ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) కు నామినేటెడ్ పదవి ఆఫర్:
ఏపీ రాజకీయాల్లో మరో కీలక సన్నివేశం చోటుచేసుకోబోతోంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) వైసీపీ చేరడం దాదాపు ఖాయమైపోయింది. ముద్రగడ నివాసానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్(Regional Coordinator), ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy) వెళ్లనున్నారు. జిల్లాలోని వైసీపీ కీలక నేతలతో కలిసి కిర్లంపూడికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీలోకి ముద్రగడను ఆహ్వానించనున్నారు. అంతేకాదు, ఎన్నికల కోడ్ రాకముందే ముద్రగడకు నామినేటెడ్ పదవిపై సీఎం జగన్ హామీ ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ విషయాన్ని ముద్రగడకు మిథున్ రెడ్డి స్వయంగా వివరించనున్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ముద్రగడకు కీలక పదవిని ఇస్తారని తెలుస్తోంది. ఈ నెల 12న వైసీపీలో ముద్రగడ చేరుతారని ఆయన అనుచరులు చెపుతున్నారు. మరోవైపు, కిర్లంపూడికి వెళ్లి ముద్రగడను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలుస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే, ముద్రగడ విషయంలో పవన్ ఏమాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో ముద్రగడకు వైసీపీ టచ్ లోకి వెళ్లింది.
ఇది చదవండి: హిందూపురం శంఖారావం యాత్రకు విచ్చేసిన లోకేష్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి