వైసీపీ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది -మంత్రి లోకేష్‌..

వైసీపీ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది -మంత్రి లోకేష్‌

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిగా నిలిపివేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు&period; ఈ ప్రచారం వందశాతం అవాస్తవమని&comma; కిట్ల పంపిణీని ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు&period; కేవలం కొన్ని అంతర్జాతీయ కారణాల వల్ల కిట్ల సరఫరాలో సుమారు నెల రోజుల జాప్యం జరుగుతోందని తెలిపారు&period;<br &sol;>&NewLine;ప్రభుత్వం నిజాయతీగా జాప్యం గురించి వెల్లడిస్తే&comma; దానిని వక్రీకరించి అసలు కిట్లే ఇవ్వరంటూ వైసీపీ పార్టీ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనమని విమర్శించారు&period;<br &sol;>&NewLine;పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిసరుకుల ధరలు పెరగడం&comma; రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో యూనిఫాం క్లాత్&comma; బూట్లు&comma; బ్యాగుల సరఫరా ఆలస్యమవుతోందని విద్యాశాఖ అధికారులు తెలిపినట్లు లోకేష్ వివరించారు&period; అయితే&comma; జూన్ 12à°¨ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు&comma; నోట్‌బుక్స్‌ కచ్చితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు&period; మిగిలిన వస్తువులను కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేసేందుకు అధికారులు తయారీ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని లోకేష్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..