పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.

పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Advertisements

<p>రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించి బాయిల్డ్ రైస్‌గా మారుస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్&ZeroWidthSpace;కుమార్&ZeroWidthSpace;రెడ్డి స్పష్టం చేశారు&period; తడిసిన ధాన్యం పేరుతో ఒక్క రైతును కూడా నష్టపరిచవద్దని&comma; తాలు&comma; తరుగు పేరుతో కోతలు విధిస్తే మిల్లర్లతో పాటు కొనుగోలు సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period; కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు చేరుకొని కాంటా కోసం నిరీక్షిస్తున్న 8&period;50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు&period; ఈ ఒక్క సంవత్సరంలో ఖరీఫ్&comma; రబీ సీజన్లకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి రూ&period;45 వేల కోట్ల చెల్లింపులు చేసిందన్నారు&period; ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల రాష్ట్ర కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&comma; మంత్రులు తుమ్మల&comma; జూపల్లి&comma; ఆడ్లూరి లక్ష్మణ్ &comma; సీఎస్&ZeroWidthSpace;రామకృష్ణరావుతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లు&comma; అధికారులతో వీడియా కాన్పరెన్స్&ZeroWidthSpace;నిర్వహించారు&period; ఈసందర్భంగా వివరిస్తూ కొనుగోళ్ల ప్రక్రియలో ట్యాగింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తే రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరుగుతాయని తెలిపారు&period; అవసరమైతే ఆదివారం రోజున కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు&period; ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి 8 వేల 749 కోట్ల చెల్లింపులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం 21 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని&comma; బ్యాగుల కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారం అబద్దమన్నారు&period; ప్రతిపక్షాలు రాజకీయ రాద్ధాంతం సృష్టించి రైతాంగంలో గందరగోళం సృష్టించేందుకే ఇటువంటి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు&period; కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే హమాలీలలో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్&comma; బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులేనని&comma; స్థానికంగా ఎవరూ పెద్దగా ఈ పనుల్లో పనిచేయడం లేదని తెలిపారు&period; బీహార్&comma; పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పాల్గొనేందుకు వారు స్వగ్రామాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కొంత జాప్యం ఏర్పడిందన్నారు&period; రబీ సీజన్‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు&comma; కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు&period; రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండగా&comma; ఇప్పటికే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు&period; ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత సునిశితమైనదని&comma; ఎక్కడా రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..