వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Advertisements

<p>వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు&period; ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయం&comma; ఆక్వా&comma; పశుసంవర్ధక రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; రాష్ట్రంలో &&num;8216&semi;ఫార్మ్ టూ హోమ్&&num;8217&semi; విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు&period; రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరేలా కొత్త మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు&period; దీనివల్ల రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటూ మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందని చెప్పారు&period; పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యడవోలు సమీపంలో &&num;8216&semi;కోకో సిటీ&&num;8217&semi; ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు&period; అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు జులైలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు&period; కడప జిల్లా పులివెందులలో నిర్మాణంలో ఉన్న ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు సీఎం పేర్కొన్నారు&period; వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరిశీలనకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని తెలిపారు&period; ఆక్వా రంగానికి ప్రోత్సాహంగా కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు&period; అలాగే మత్స్యకారుల సంక్షేమం కోసం 200 మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు&period; రైతులు&comma; మత్స్యకారులు&comma; వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..