ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు.

ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Advertisements

<p>ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో పొందేందుకు ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించారు సీఎం చంద్రబాబు&period; ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో RTGS సేవలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు&period;&period;ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా చూడాలన్నారు&period; ప్రభుత్వం అందించే అన్ని సేవలనూ ఆన్‌లైన్‌ చేశామని తెలిపారు&period; మన మిత్ర వాట్సాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేందుకు అవగాహన పెంచాలని ఆదేశించారు&period; ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా ఆన్‌లైన్‌ యాప్‌ను రూపొందించాలని ఆదేశించారు&period; పట్టణ ప్రాంతాల తరహాలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే తరహా సేవలు అందించాలన్నారు&period; ప్రజలకు తాగునీటి సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు&period; రక్షిత మంచినీటి ట్యాంకులు&comma; పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్న మంచినీటి శాంపిళ్లను ప్రతిరోజూ పరీక్షించాలని స్పష్టం చేశారు&period; రక్షిత నీటి సరఫరాలో అశ్రద్ధ ఉండొద్దని&period;&period;మంచినీటి సరఫరా పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత ఉండాలన్నారు&period; ప్రజల్లో అవగాహన వస్తేనే క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమాలను విజయవంతం చేయగలమని చెప్పారు&period; ప్రకృతి&comma; పరిసరాల శుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచేలా వినూత్న కార్యక్రమం చేపట్టాలని సూచించారు&period; జలధార కార్యక్రమం ఫలితాలు కనిపించాలని&comma; చెరువులన్నీ నిండేలా చర్యలు చేపట్టాలన్నారు&period; వర్షపు నీటిని ఒడిసిపట్టాలని&comma; ప్రతి కుంట&comma; ప్రతి చెరువులోని నీటి నిల్వను ఆన్‌లైన్‌లో సమీక్షించాలని నిర్దేశించారు&period; అనంతపురం జిల్లాలో ఆన్‌లైన్‌ పరిశీలనా విధానాన్ని అమలు చేయాలన్నారు&period; మహిళలపై నేరాలను అరికట్టాలని&comma; గంజాయిని అరికట్టేందుకు మూలాల్లోకి వెళ్లాలని ఆదేశించారు&period; మహిళలపై దాడులు చేయాలంటేనే భయపడేలా శిక్షలు ఉండాలని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.