బొబ్బిలిలో 100 అడుగుల బైపాస్ రోడ్డు కలనేనా..?

బొబ్బిలిలో 100 అడుగుల బైపాస్ రోడ్డు కలనేనా..?

Advertisements

<p>బొబ్బిలి పట్టణ అభివృద్ధికి కీలకంగా మారాల్సిన 100 అడుగుల బైపాస్ రోడ్డు… ఇప్పటికీ కాగితాలకే పరిమితం కావడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది&period; ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రాజా కళాశాల&comma; గొల్ల వీధి జంక్షన్ మీదుగా గొల్లపల్లి దాడితల్లి వనం గుడి వరకు టౌన్ ప్లానింగ్ ప్రకారం ప్రతిపాదించిన ఈ రహదారి అభివృద్ధి పనులు పదేళ్లుగా ముందుకు సాగడం లేదు&period; కాలక్రమేణా రోడ్డు మార్గమంతా ఆక్రమణలకు గురవుతుండగా&comma;కొన్ని చోట్ల పక్కా భవనాలు కూడా నిర్మాణమవుతున్నాయి&period;వీటన్నింటిని మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి&period; మధ్యలో బుడా నిధులతో కాలవల నిర్మాణం చేపడతామని ప్రకటించినా రాజకీయ ఒత్తిళ్లతో ఆ పనులు నిలిచిపోయాయి&period; ఎమ్మెల్యే బేబీ నాయన పలుమార్లు రోడ్డు విస్తరణపై హామీలు ఇచ్చినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు&period; బైపాస్ రోడ్డు అభివృద్ధి అయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి&comma; భారీ వాహనాల రాకపోకలు పట్టణానికి దూరమవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఒక పట్టణ భవిష్యత్తు అక్కడి రోడ్లు&comma; మౌలిక వసతులపై ఆధారపడి ఉంటుంది&period; కానీ బొబ్బిలిలో మాత్రం టౌన్ ప్లానింగ్ నిబంధనలు అమలు కాక ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గొల్లపల్లి వరకు ప్రతిపాదించిన 100 అడుగుల బైపాస్ రోడ్డు పూర్తిగా ఆక్రమణల బారిన పడింది&period; ఆ పండుగ తర్వాత&comma; ఈ పండగ తర్వాత అంటూ అధికారుల ప్రకటనలు మాత్రమే వినిపిస్తున్నాయి తప్ప పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు&period; పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ సమస్యలతో నిండిపోగా&comma; భారీ వాహనాలు నేరుగా జనావాసాల్లోకి రావడం ప్రజలకు ప్రమాదకరంగా మారుతోంది&period; ఈ బైపాస్ రోడ్డు అభివృద్ధి జరిగితే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా భవిష్యత్తులో బొబ్బిలి మరింత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది&period; ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు&comma; ప్రభుత్వం స్పందించి టౌన్ ప్లానింగ్ ప్రకారం రోడ్ల అభివృద్ధి చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.

దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది..