ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగం దూసుకెళుతోందని&comma; &&num;8216&semi;మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్&&num;8217&semi; అనేది ఇప్పుడు నాణ్యతకు&comma; నమ్మకానికి చిహ్నంగా మారుతోందని రాష్ట్ర ఐటీ&comma; మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు&period; రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు&period; దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను కూడా పంచుకున్నారు&period; &&num;8220&semi;మొబైల్ ఫోన్లు&comma; స్క్రీన్ల నుంచి మొదలుకొని ఏసీలు&comma; బైక్‌లు&comma; కార్ల వరకు&period;&period; భారతీయులు విశ్వసించే ఎన్నో బ్రాండ్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తయారవుతున్నాయి&&num;8221&semi; అని లోకేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు&period; రాష్ట్రంలో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక వసతులు&comma; పనుల వేగవంతమైన అమలు&comma; బలమైన తయారీ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని వివరించారు&period;<&sol;p>&NewLine;<p>&&num;8220&semi;మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది వేగంగా నాణ్యతకు&comma; నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోంది&period; ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కండి&period; ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేయండి&period;&period; ప్రపంచం కోసం తయారు చేయండి&&num;8221&semi; అని లోకేష్ పిలుపునిచ్చారు&period; ఆయన షేర్ చేసిన వీడియోలో ఏపీలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు ప్రఖ్యాత కంపెనీల ఉత్పత్తులను&comma; తయారీ యూనిట్లను ప్రదర్శించారు&period; రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు&comma; పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉందని ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..