గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక పర్యటన.

గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక పర్యటన

Advertisements

<p>గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని తూర్పు కాల్వకట్ట రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు&period; రెండ్రోజుల క్రితం ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు&period;&period; ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోవడాన్ని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు&period; వెంటనే వ్యర్థాలు తొలగించాలని మున్సిపల్‌ కమిషనర్‌&comma; సిబ్బందిని మంత్రి ఆదేశించారు&period; అటువైపు వెళ్లిన మంత్రి&period;&period; వ్యర్థాలు తొలగించకపోవడాన్ని గమనించి మున్సిపల్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అధికారులను ఘటనాస్థలికి పిలిపించి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు&period; చెత్త కుప్పలు ఎక్కువగా ఉన్నాయని&period;&period; టెండర్‌ పిలిచి తొలగిస్తామని మున్సిపల్‌ సిబ్బంది సమాధానం చెప్పారు&period; మున్సిపాలిటీ జేసీబీ&comma; ట్రాక్టర్లతో చేయాల్సిన పనికి టెండరా&quest; అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు&period; పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవుపెట్టి వెళ్లండని హెచ్చరించారు&period; వ్యర్థాలు తొలగించే వరకు ఇక్కడే ఉంటానని కాల్వగట్టుపై ఉన్న బల్లపై కూర్చున్నారు&period; దీంతో హడావుడిగా అక్కడికి చేరుకున్న మున్సిపల్‌ యంత్రాంగం&period;&period; చెత్త తొలగింపు పనులు చేపట్టింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.