పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు

Advertisements

<p>గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది&period; ముఖ్యంగా బూర్గంపాడు మండలం ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు&period; పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45&period;72 మీటర్లు &period;నీటి నిల్వ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరినప్పుడు గోదావరి ప్రవాహం వెనక్కి తన్నే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; దీంతో గోదావరిలో కలిసే కిన్నెరసాని&comma; ముర్రేడువాగు వంటి ఉపనదుల నీరు బయటకు వెళ్లక బూర్గంపాడు పరిసరాల్లోనే నిలిచిపోతుందని అంచనా&period; భారీ వరదల సమయంలో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలు&comma; పోలవరం పూర్తి స్థాయిలో నిండితే పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని చెబుతున్నారు&period; కేవలం 150 అడుగుల కాంటూర్ వరకే కాకుండా&comma; వరద ఉధృతి కారణంగా 160 అడుగుల ఎత్తు వరకు కూడా ముంపు ప్రభావం ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం&period; దీని వల్ల పంట పొలాలు&comma; నివాస గృహాలు&comma; గ్రామీణ రహదారులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ముంపు ముప్పు నుంచి బూర్గంపాడు మండలం ను రక్షించేందుకు అధికారులు భారీ కరకట్టల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు&period; సుమారు 51 మీటర్ల ఎత్తుతో&comma; 11&period;64 కిలోమీటర్ల పొడవున కరకట్ట నిర్మాణానికి రూ&period;789 కోట్ల అంచనాతో ప్రణాళికలు సిద్ధమయ్యాయి&period; కానీ నిధుల మంజూరు&comma; భూసేకరణ&comma; నిర్మాణ ప్రక్రియలపై ఇంకా స్పష్టత లేకపోవడం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది&period; మరోవైపు ముంపు గ్రామాలపై క్షేత్రస్థాయి సర్వే కూడా పూర్తిగా జరగలేదని స్థానికులు చెబుతున్నారు&period; మ్యాపుల్లో గీసిన కాంటూర్ లైన్లకే పరిమితం కాకుండా&comma; క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఏయే గ్రామాలు ముంపులోకి వస్తున్నాయో భౌతిక గుర్తులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు&period; అయితే ఇప్పటివరకు అలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల తమ భవిష్యత్తుపై ప్రజల్లో అయోమయం నెలకొంది &period; తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు &comma; పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కలిసి సంయుక్త సర్వే చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>మరో వైపు పోలవరం ప్రభావంతో ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజల పునరావాసం కూడా ఇప్పుడు అత్యంత కీలక అంశంగా మారింది&period; పూర్తిగా నీటిలో మునిగే లోతట్టు గ్రామాల ప్రజలకు మెరక ప్రాంతాల్లో శాశ్వత గృహాలు నిర్మించి ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు&period; పునరావాస కాలనీల్లో తాగునీరు&comma; విద్యుత్&comma; వైద్యం&comma; విద్య &comma; ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది&period; ఇంకో వైపు రైతులు తమ పంట భూములు కోల్పోయే ప్రమాదం ఉందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు&period; చట్టప్రకారం సరైన నష్టపరిహారం చెల్లించి&comma; ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి&period; గోదావరి వరదల సమయంలో ఉపనదుల నీటిని బయటకు పంపేందుకు భారీ మోటార్ పంపింగ్ వ్యవస్థలు సిద్ధం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు&period; వర్షాకాలానికి ముందే బఫర్ స్టాక్ కేంద్రాల్లో ఆహారం&comma; మందులు&comma; అత్యవసర వస్తువులు సిద్ధంగా ఉంచి ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>పోలవరం ప్రాజెక్టు ను రెండు దశల నీటి నిల్వ సామర్థ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు&period; మొదటి దశలో 41&period;15 మీటర్లు&comma; రెండో దశలో 45&period;72 మీటర్ల వరకు నీటి మట్టాన్ని పెంచే ప్రణాళిక ఉంది&period; అయితే మొదటి దశ నుంచే బూర్గంపాడు మండలం పై ముంపు ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు&period; అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యపై తగిన శ్రద్ధ చూపడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; వరదల సమయంలో తాత్కాలిక సహాయక చర్యలకే పరిమితం కాకుండా&comma; శాశ్వత రక్షణ ప్రణాళికను అమలు చేయాలని వారు కోరుతున్నారు&period; ముఖ్యంగా కరకట్టల నిర్మాణం&comma; పంపింగ్ స్టేషన్లు&comma; పునరావాస కాలనీలు&comma; అత్యవసర హెచ్చరిక వ్యవస్థలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు&period; ముంపు తీవ్రత ఎంత ఉంటుందో స్పష్టత లేక ప్రజలు ప్రతీ వర్షాకాలంలో భయాందోళనల మధ్య జీవిస్తున్నారు&period; ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి శాస్త్రీయ అధ్యయనాలతో కూడిన సమగ్ర రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.