ఏపీ ప్రభుత్వంతో జట్టుకట్టిన గూగుల్ జట్టు.

ఏపీ ప్రభుత్వంతో జట్టుకట్టిన గూగుల్ జట్టు

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతికతతో పాటు ఇతర కీలక రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం&comma; టెక్ దిగ్గజం గూగుల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది&period; ఇందులో భాగంగా ఇరుపక్షాల సమన్వయంతో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు&period; రెండు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గూగుల్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు&period; ఏఐ&comma; క్లౌడ్ కంప్యూటింగ్&comma; డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు&period; ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఏఐ మరియు డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని గూగుల్‌ ప్రతినిధులకు సీఎం విజ్ఞప్తి చేశారు&period; ముఖ్యంగా ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగానికి&comma; &&num;8216&semi;సంజీవని&&num;8217&semi; ప్రాజెక్టు అమలుకు సాంకేతిక భాగస్వామ్యం కావాలని కోరారు&period; రాష్ట్ర యువతకు ఏఐ&comma; క్లౌడ్ టెక్నాలజీ రంగాలలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు ప్రతిపాదించారు&period; తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి లాజిస్టిక్స్ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు&period; వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయి&comma; రాష్ట్రంలో సప్లై చైన్ మరియు లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించారు&period; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరరేఖ&comma; పోర్టులు మరియు మెరుగైన కనెక్టివిటీ వంటి మౌలిక వసతులను వివరిస్తూ పెట్టుబడులకు ఆహ్వానించారు&period; మరోవైపు&comma; యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తోనూ సమావేశమైన సీఎం&comma; రాష్ట్రంలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు చొరవ చూపారు&period; పట్టణ ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..