99 రోజుల యాక్షన్ ప్లాన్పై సీఎం రేవంత్ సమీక్ష.

99 రోజుల యాక్షన్ ప్లాన్పై సీఎం రేవంత్ సమీక్ష

Advertisements

<p>రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన ప్రజా పాలన‌‌-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని ముఖ్యమంత్రి ఎ&period;రేవంత్ రెడ్డి అన్నారు&period; 99 రోజుల పాటు రాష్ట్రమంతటా జరిగిన కార్యక్రమాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు&period; విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు&comma; వాటి ద్వారా వచ్చిన ఫలితాలను సీఎం అడిగి తెలుసుకున్నారు&period; రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి&comma; ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు&comma; డీజీపీ సీవీ ఆనంద్&comma; సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా అన్ని విభాగాలు తాము జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చేపట్టిన కార్యక్రమాల వివరాల నివేదికలను సమర్పించాయి&period;<&sol;p>&NewLine;<p>99 రోజుల యాక్షన్ ప్లాన్లో చురుగ్గా పాల్గొన్న విభాగాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు&period; ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రతినెలా క్షేత్రస్థాయికి వెళ్లాలని గతంలోనే ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు&period; క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు&comma; జిల్లా కలెక్టర్లపై తనకు నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని సీఎం ఆదేశించారు&period; వారిపై క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకోకూడదో&period;&period; వెంటనే వివరణ కోరాలని చెప్పారు&period; ప్రభుత్వ ఆదేశాలను పాటించని అధికారులను ఉపేక్షించవద్దని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రస్థాయిలో 99 రోజుల యాక్షన్ ప్లాన్పై సమీక్ష నిర్వహించినట్లే&period;&period; జిల్లాల వారీగా వెంటనే ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై వెంటనే సమీక్ష జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు&period; ఈ సమీక్షలకు రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించి&comma; ఆ జిల్లాకు పంపించాలని చెప్పారు&period; స్పెషలాఫీసర్ ఆ జిల్లా కలెక్టర్ కలిసి అన్ని విభాగాల్లో 99 రోజుల పాటు జరిగిన ప్రత్యేక కార్యక్రమాలు&comma; ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు&comma; వివిధ పథకాలపై వచ్చిన స్పందనలన్నింటినీ సమీక్షించాలని ఆదేశించారు&period; జిల్లాల వారీగా ఈ ప్రగతి నివేదికలను విడుదల చేయాలని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..