ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన నారా లోకేశ్.

ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన నారా లోకేశ్

Advertisements

<p>కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలను అందుకునేందుకు ఢిల్లీకి విచ్చేసిన ప్రముఖ సినీ నటులు మురళీమోహన్&comma; రాజేంద్రప్రసాద్‌లను ఏపీ ఐటీ&comma; విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘనంగా సత్కరించారు&period;<br &sol;>&NewLine;నేడు హస్తినలో జరగనున్న పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఈ ఇద్దరు సీనియర్ నటులను లోకేశ్ కలుసుకుని&comma; జ్ఞాపికలు అందజేసి అభినందించారు&period; వందలాది చిత్రాలలో నటించి&comma; తెలుగు చిత్రసీమకు వన్నె తెచ్చిన ఇద్దరు దిగ్గజ నటులకు ఏకకాలంలో పద్మశ్రీలు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమని ఈ సందర్భంగా లోకేశ్ ప్రశంసించారు&period; దివంగత నందమూరి తారక రామారావు గారితో తమకున్న సాన్నిహిత్యాన్ని మురళీమోహన్&comma; రాజేంద్రప్రసాద్‌లు గుర్తుచేసుకున్నారు&period; భవిష్యత్తులోనూ తెలుగు కళామతల్లికి తమ సేవలను కొనసాగించాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు&period; ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొని మురళీమోహన్&comma; రాజేంద్రప్రసాద్‌లను అభినందించి సన్మానించారు&period;<&sol;p>&NewLine;<p>ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఢిల్లీలో పర్యటిస్తున్న నారా లోకేశ్ ఢిల్లీలో భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి లీ సియోంగ్ హోతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు&period; ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను&comma; ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై ఈ భేటీలో చర్చించారు&period; భారత్‌లో కొరియన్ కంపెనీల విస్తరణకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది&period; సెమీకండక్టర్లు&comma; నౌకా నిర్మాణం&comma; ఎలక్ట్రిక్ వాహనాలు&comma; మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా దక్షిణ కొరియా అగ్రగామిగా ఉందని మంత్రి లోకేశ్ గుర్తుచేశారు&period; ఈ నేపథ్యంలో&comma; కొరియా కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ఒక నమ్మకమైన&comma; దీర్ఘకాలిక భాగస్వామిగా ఎలా నిలవగలదో రాయబారికి వివరించారు&period; భవిష్యత్తులో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకునే మార్గాలపై లోకేశ్&comma; లీ సియోంగ్ హో చర్చించుకున్నారు&period; రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని&comma; ప్రభుత్వ విధానాలను లోకేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు&period; ఈ భేటీ ద్వారా ఏపీ&comma; దక్షిణ కొరియా మధ్య పారిశ్రామిక సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.