నెల్లూరుకు మూడు భారీ పరిశ్రమలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.

నెల్లూరుకు మూడు భారీ పరిశ్రమలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Advertisements

<p>నెల్లూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది&period; నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లాకు చెందిన మూడు కీలక పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం లభించింది&period; దీంతో జిల్లాలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి&period;మనుబోలు మండలం మడమనూరు వద్ద 3&comma;678 కోట్ల రూపాయల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష&comma; పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి&period;అదేవిధంగా దుత్తలూరు మండలం పాపంపల్లిలో 1&comma;000 కోట్ల రూపాయల పెట్టుబడితో అనంత టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రక్షణ రంగానికి చెందిన మందుగుండు సామగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది&period;కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో వాయేనా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విండ్ టర్బైన్ తయారీ పరిశ్రమను స్థాపించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది&period;ఈ మూడు భారీ పరిశ్రమల ఏర్పాటుతో నెల్లూరు జిల్లా పారిశ్రామిక రంగంలో మరింత ముందడుగు వేయనుండగా&comma; స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.