సాయికృష్ణ కేసులో కొనసాగుతోన్న సిట్‌ దర్యాప్తు.

సాయికృష్ణ కేసులో కొనసాగుతోన్న సిట్‌ దర్యాప్తు

Advertisements

<p>ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో సిట్ విచారణ జరుగుతోంది&period; పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు&period; సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో సురేష్ కీలకంగా ఉన్నారు&period; లాకప్ డెత్ అనంతర పరిణామాలపై సురేష్‌ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు&period; సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన తరువాత సీఐ నాగరాజుకి సురేష్ సహకరించినట్లు గుర్తించారు&period; పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం&comma; నాగరాజుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు&period; సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత కుటుంబ సభ్యులతో సురేష్ రాయబారంపై సిట్ అధికారులు దృష్టి సారించారు&period;<&sol;p>&NewLine;<p>ఐతే సాయికృష్ణ లాకప్‌ డెత్‌ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్&comma; నాని జాడ ఇంకా కనిపించలేదు&period; సాయికృష్ణ మృతి&comma; శవం మాయం వ్యవహారంలో వీరి పాత్ర ఉందని ఖరారు చేసిన నేపథ్యంలో వారి కోసం వేట కొనసాగుతోంది&period; వీరిని అదుపులోకి తీసుకుని తమ ముందు హాజరుపర్చాలని సౌత్‌ ఏసీపీకి సిట్‌ అధికారులు ప్రొడక్షన్‌ ఆన్‌ మెమో ఇచ్చారు&period; ఈ కేసులో వీరిని సిట్‌ నిందితులుగా చేర్చింది&period; వారిద్దరినీ నగర సీపీ రాజశేఖరబాబు సస్పెండ్‌ చేశారు&period; వీరు దొరికితే కేసు చిక్కుముడి వీడొచ్చని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>కృష్ణలంక స్టేషన్‌లో సీఐ నాగరాజుకు సన్నిహితులుగా ముద్రపడిన పదిమందిపై సిట్‌ గురిపెట్టింది&period; వీరిలో కీలకంగా ఉన్న సురేష్‌ నుంచి పలు వివరాలు సేకరిస్తోంది సిట్‌&period; టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ మురళీకృష్ణను రెండోసారి పిలిచి విచారించింది&period; మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన కృష్ణలంక కానిస్టేబుల్‌ బాబూరావును ఇప్పటికే రెండుసార్లు విచారించారు&period; స్టేషన్‌లో సెక్షన్‌ ఇన్‌ఛార్జి అయిన హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు&comma; అలాగే బాబూరావుతో పాటు మరో హోంగార్డును కూడా ప్రశ్నించారు&period; ఇక ఈ కేసు విచారణలో భాగంగా సిట్‌ అధికారులు&period;&period; సౌత్‌ ఏసీపీ మానసపై ప్రశ్నల వర్షం కురిపించారు&period; సాయికృష్ణ అదృశ్యం గురించి మీకు ఎప్పుడు తెలిసింది&quest; తర్వాత మీరు అంతర్గత విచారణ చేయించారా&quest; చేస్తే&period;&period; అందులో ఏం తేలింది&quest; మృతదేహం ఏమైందని ప్రశ్నించారు&period; ఇన్‌స్పెక్టర్‌పై పర్యవేక్షణ అధికారి అయి ఉండి ఎందుకు పూర్తిస్థాయిలో విచారణ చేయలేదని అడిగినట్లు తెలుస్తోంది&period; ఇదిలా ఉంటే&period;&period;సాయికృష్ణ కేసుకు సంబంధించి హైకోర్టులో అతని తల్లి విజయలక్ష్మి వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌&period;&period;సోమవారం విచారణకు రానుంది&period; ఈ నేపథ్యంలో కేసులో దర్యాప్తు పురోగతి&comma; న్యాయస్థానానికి నివేదించాల్సిన అంశాలపై సిట్‌ అధికారులు&period;&period; డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ బైరా రామకోటేశ్వరరావుతో సమావేశమయ్యారు&period; ఇప్పటివరకు విచారణలో వెలుగుచూసిన అంశాలపై చర్చించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.