ఒకప్పుడు అమరావతికి జై కొట్టిన జగన్.

ఒకప్పుడు అమరావతికి జై కొట్టిన జగన్

Advertisements

<p>ఒకప్పుడు అమరావతికి జై కొట్టారు&period;&period; తర్వాత రూటు మార్చి మూడు రాజధానులు అన్నారు&period; మూడు ముక్కలాట ఆడారు&period; అధికారంలో ఉన్నప్పుడు విశాఖే మా ముద్దుబిడ్డ అన్నారు&period; ప్యాలెస్ తప్ప మూడు బిల్డింగ్‌లు కూడా కట్టలేదు&period; కట్ చేస్తే&period;&period;వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇప్పుడు సడన్‌గా మావిగన్ అంటున్నారు&period; అధికారం పోయినా&comma; జనాలు 11 సీట్లకే పరిమితం చేసినా జగన్‌కు తత్వం బోధపడలేదు&period; ఒక చేత్తో అమరావతి రైతులపై సానుభూతి చూపిస్తూనే&period;&period; ఇంకో చేత్తో అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ అజెండాతో వెళ్తామంటున్నారు&period; మొత్తానికి మావిగన్ స్లోగన్‌తోనే వచ్చే ఎన్నికల్లో తలపడతామంటున్నారు&period; అయితే ఓవైపు అమరావతి నిర్మాణాలు శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో&period;&period; జగన్ తెచ్చిన ఈ సరికొత్త ప్రతిపాదన అటు ప్రజల్లోనే కాదు&period;&period; ఇటు సొంత పార్టీ నేతల్లోనూ తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది&period; వచ్చే ఎన్నికలలోపు అమరావతి రాజధానికి ఓ రూపు వచ్చేస్తుంది&period; ఇప్పటికే నిర్మాణ పనులు ఫ్లడ్‌లైట్ల వెలుగులతో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి&period; మరి అన్ని పనులు పూర్తయితే ఇంకో రాజధాని అవసరం ఏముంటుంది అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న&period; ఇంతకీ అసలు మావిగన్ కథ ఏంటి&period;&period;&quest; జగన్ మైండ్‌లో ఏముంది&period; అధికార కూటమి ఏమంటోంది&period;&period;&quest;<&sol;p>&NewLine;<p>2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీకి రాజధాని అంశం ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారింది&period; నాడు ప్రతిపక్ష నేతగా అమరావతికి జై కొట్టిన జగన్మోహన్ రెడ్డి&period;&period; 2019లో అధికారంలోకి రాగానే మాట మార్చారు&period; మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు&period; ఐదేళ్ల పాటు కాలయాపన చేసి&period;&period; చివరకు ఉత్తరాంధ్రా ప్రజలు కానీ&comma; కృష్ణా-గుంటూరు ప్రజలు కానీ జగన్ నిర్ణయాన్ని స్వాగతించలేదు&period; మొన్నటి ఎన్నికల్లో విద్యాధికులు&comma; తటస్థులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఓట్ల రూపంలో వైసీపీకి గట్టి బుద్ధి చెప్పారు&period; అయినా సరే జగన్ గతాన్ని మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు&period; ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం &&num;8211&semi; విజయవాడ &&num;8211&semi; గుంటూరు పేరును తెరపైకి తెచ్చారు&period; వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అనే ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిని నిర్వీర్యం చేస్తాం అని జగన్ చెప్పకనే చెప్పారంటున్నారు టీడీపీ నేతలు&period; ఎన్ని భవనాలు కట్టినా నేలమట్టం చేసి&period;&period; మావిగన్ ను అభివృద్ధి చేస్తాం అన్నది జగన్ మాట&period; మరి రాజధానికి వేలకు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల మాట ఏంటి&quest; 50 వేల కోట్ల రూపాయల రుణం మాట ఏంటి&quest; అంటే తెలియని పరిస్థితి&period; దాదాపు 15 సంవత్సరాల పాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండడం అంటే దాని వెనుక జగన్ వైఫల్యమే కనిపిస్తోందని&period;&period; ఆయన ప్రజల్లో ఒక రకమైన విభజన రేఖ తేవాలని ప్రయత్నిస్తున్నట్టు ఉందని టీడీపీ నేతలు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>అమరావతిని వ్యతిరేకించినందుకే ఆ పార్టీ గత ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైందని అన్నారు సీఎం చంద్రబాబు&period; జగన్ పాలనలో రాజధాని రైతులపై దాడులు జరిగాయని&comma; కుల&comma; మత&comma; ప్రాంతీయ రాజకీయాలతో ప్రజలను విడదీయాలని ప్రయత్నించారని ఆరోపించారు&period; రాజధానికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర సహకారంతో చర్యలు తీసుకున్నామని&comma; అయినప్పటికీ జగన్ అమరావతిని అంగీకరించడం లేదని విమర్శించారు&period;<&sol;p>&NewLine;<p>రాజకీయ లబ్ధి కోసం జగన్ తెరపైకి తెచ్చిన ఈ మావిగన్ అనే సరికొత్త వ్యూహం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏమిటో ఆయన ప్రజలకు స్పష్టం చేయాల్సి ఉంది&period; మచిలీపట్నం&comma; విజయవాడ&comma; గుంటూరు నగరాలు దశాబ్దాలుగా ఉన్నవే&period; పైగా కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న అమరావతి సైతం భౌగోళికంగా ఈ విజయవాడ-గుంటూరు పరిధిలోనే ఉంది&period; అలాంటప్పుడు అమరావతికి భిన్నంగా జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ ప్లాన్ ఏంటో&comma; దాని స్వరూప స్వభావాలు ఏమిటో కనీస రోడ్ మ్యాప్ లేకుండా కేవలం నినాదాలకే పరిమితం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు&period;<&sol;p>&NewLine;<p>ఏదైనా ప్రతికూల అంశాలు ఫలితాలపై ప్రభావం చూపినప్పుడు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి&period; కానీ ఈ విషయంలో జగన్ వెనుక పడ్డారనే టాక్ వినిపిస్తోంది&period; అమరావతిని వ్యతిరేకించడం వల్ల గుంటూరు&comma; కృష్ణా జిల్లాల్లో వైసీపీ రాజకీయంగా భారీగా నష్టపోయింది&period; విద్యాధికులు&comma; తటస్థులు ఓట్ల రూపంలో తమ తీర్పును స్పష్టంగా ఇచ్చారు&period; అయినప్పటికీ జగన్ తన పంథా మార్చుకోకపోవడం గమనార్హం&period; ఇప్పుడు ఆయన కొత్తగా జపిస్తున్న మావిగన్ మంత్రానికి అటు విజయవాడ&comma; గుంటూరు ప్రజల నుంచి కానీ&comma; ఇటు మచిలీపట్నం నుంచి కానీ కనీస స్పందన కరువైంది&period; ఒకవైపు అమరావతిలో శాశ్వత నిర్మాణాలు శరవేగంగా సాగుతుంటే&period;&period; ఈ తరుణంలో అమరావతి కావాలా&quest; మావిగన్ కావాలా&quest; అంటూ ప్రజలను ప్రశ్నించడం ఆయనలోని రాజకీయ విధ్వంసక ఆలోచనను బయటపెడుతోందనే విమర్శలు వస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు రాజధాని విషయంలో వైసీపీ అధినేత ఒకసారి అమరావతి&comma; మరోసారి మూడు రాజధానులు&comma; ఇప్పుడు సడన్‌గా మావిగన్ అంటూ పదే పదే మాట మారుస్తుంటే&period;&period; రేపు జనాల్లోకి వెళ్తే తమ పరిస్థితి ఏంటని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు భయపడుతున్నారు&period; మొన్నటికి మొన్న అమరావతి రైతులకు మద్దతుగా పరామర్శకు వెళ్లిన వైసీపీ నేతలకు స్థానికంగా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది&period; అయినా సరే&comma; అధినేత ఏం చెప్పినా దానికి తలూపడం మినహా మరో ప్రత్యామ్నాయం లేక&period;&period; వచ్చే ఎన్నికల నాటికి వీరంతా మావిగన్ స్లోగన్‌తో ప్రచారానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది&period; ఇప్పటికి అమరావతి రాజధాని విషయంలో వైసీపీపై వ్యతిరేకముద్ర పడిందని&period;&period; ముఖ్యంగా విద్యాధికులతో పాటు న్యూట్రల్‌గా ఉండే వాళ్లు కూడా దీనిని తప్పుపడుతూ ఓట్ల రూపంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారట&period; అయినా ఎందుకో జగన్ వైఖరిలో మార్పు రాకపోవడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారట&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.