సాలూరులో భారీ భూ రిజిస్ట్రేషన్ స్కామ్ ఆరోపణలు..

సాలూరులో భారీ భూ రిజిస్ట్రేషన్ స్కామ్ ఆరోపణలు

Advertisements

<p>పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో భారీ భూ రిజిస్ట్రేషన్ అవకతవకలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది&period; ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగించారని ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ రమణమూర్తిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; సాలూరు పట్టణ నడిబొడ్డున ఉన్న డగ్లస్ చర్చి భూమికి సంబంధించిన 3&period;14 సెంట్ల స్థలానికి మార్కెట్ విలువ ప్రకారం సుమారు ఆరు కోట్ల రూపాయల చలానా చెల్లించాల్సి ఉండగా&comma; కేవలం 95 లక్షల రూపాయలతోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేశారనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి&period; ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి దాదాపు ఐదు కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు&period; అదే సమయంలో భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి&period; ఈ అంశంపై ఎస్టీ న్యాయ సలహాదారు రేగు మహేష్&comma; రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర సభ్యుడు గొంప ప్రకాష్ గ్రీవెన్స్‌లో అధికారిక ఫిర్యాదు చేయడంతో వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది&period; దింతో జిల్లాలో ఈ ఘటన రాజకీయ&comma; సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది&period;<&sol;p>&NewLine;<p>సాలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా రిజిస్ట్రార్ ఎం&period; పార్వతి విచారణ చేపట్టడం ఆసక్తికరంగా మారింది&period; జిల్లాధికారుల ఆదేశాల మేరకు సాలూరుకు చేరుకున్న ఆమె&comma; తప్పుడు రిజిస్ట్రేషన్లపై పలు ఆధారాలను పరిశీలించారు&period; ఫిర్యాదుదారులు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు&comma; మ్యూటేషన్ వివరాలు&comma; చలానా లెక్కలు చూపిస్తూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు&period; ముఖ్యంగా ఒక్కరోజులోనే మ్యూటేషన్ పూర్తి చేసి అదేరోజు రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని ఎస్టీ న్యాయ సలహాదారు రేగు మహేష్&comma; గొంప ప్రకాష్ జిల్లా రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు&period; సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉన్న సమయంలో ఇన్‌చార్జిగా వ్యవహరించిన రమణమూర్తి తప్పుడు రిజిస్ట్రేషన్ల ద్వారా కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు&period; మరోవైపు&comma; ఈ వ్యవహారంపై వార్తలు రాసిన జర్నలిస్టులపై అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులు వచ్చాయని&comma; అందుకు సంబంధించిన ఆడియోలను కూడా జిల్లా రిజిస్ట్రార్‌కు వినిపించినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<p>ఇక ఈ వివాదంపై స్పందించిన ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ రమణమూర్తి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు&period; తాను అన్ని నిబంధనలు పాటిస్తూ&comma; సరైన పత్రాలు ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్లు నిర్వహించానని ఆయన చెబుతున్నారు&period; కొందరు వ్యక్తులు వ్యక్తిగత అక్కసుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>దీనిపై సబ్ రిజిస్ట్రార్ కూడా స్పందించారు &period;తాను సేవలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం జరిగిందని తెలిపారు &period;ఇంతకు ముందు తన వద్దకు ఇలాంటి రిజిస్ట్రేషన్ కోసం ఎవరు రాలేదని అన్నారు &period;<&sol;p>&NewLine;<p>అయితే మరోవైపు రమణమూర్తిపై గతంలో కూడా పలు పత్రికల్లో కథనాలు వెలువడినట్లు ఫిర్యాదుదారులు చెబుతున్నారు&period; రిజిస్ట్రార్ కార్యాలయంలో కుల ప్రాతిపదికన వ్యవహారాలు నడుస్తున్నాయని&comma; అవినీతి ద్వారా కోట్ల రూపాయలు కూడబెట్టారని ఆరోపణలు చేస్తున్నారు&period; ప్రస్తుతం ఈ కేసు జేసీ కోర్టులో విచారణ దశకు చేరుకోవడం గమనార్హం&period; విచారణలో నిజానిజాలు వెలుగులోకి రావాలని ప్రజలు కోరుతున్నారు&period; ప్రభుత్వ భూములు&comma; చర్చి భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక సంస్థలు&comma; ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..