నెల్లూరులో డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రి నారాయణ.

నెల్లూరులో డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రి నారాయణ

Advertisements

<p>నెల్లూరు రూరల్‌లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు&period; దొంతాలి డంపింగ్ యార్డును మున్సిపల్ శాఖ నారాయణ పరిశీలించారు&period; చెత్త నిర్వహణ పనులు&comma; వ్యర్థాల శుద్ధి ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు&period;జూలై నెలాఖరులోగా రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగిస్తామని మంత్రి తెలిపారు&period; ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శవంతమైన చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు&period;గత ప్రభుత్వం చెత్త నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ప్రజలపై చెత్త పన్ను విధించిందని విమర్శించారు&period;<br &sol;>&NewLine;ప్రస్తుతం గుంటూరు&comma; విశాఖపట్నంలోని వెస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లలో ప్రతిరోజూ సుమారు 2&comma;800 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు&period;2014లో మంజూరైన వెస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను గత ప్రభుత్వం రద్దు చేయడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని&comma; విజన్ లేకపోవడంతో ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లలేదని ఆరోపించారు&period;కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ఆరు వెస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని&comma; వాటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.