కృష్ణా-గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి.

కృష్ణా-గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి

Advertisements

<p>నదుల అనుసంధానం చేస్తే&period;&period; రాష్ట్రానికి కరవు ఉండదని అన్నారు సీఎం చంద్రబాబు&period; ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర కృష్ణా-గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని&comma; సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది&period; ఆ తర్వాత సాగునీటి రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124à°µ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు&period; ఇంజనీరుగా కేఎల్ రావు అందించిన స్ఫూర్తిని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ&period;&period; జలవనరులే అభివృద్ధికి మూలమని స్పష్టం చేశారు&period; నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి&comma; రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు&period; మార్చి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు&period; పెన్నా-వంశధార నదుల అనుసంధానం చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు&period; వచ్చే మూడేళ్లలో రూ&period;35వేల కోట్లు ఖర్చు చేసి&period;&period;36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు&period; గంగా-కావేరి నదుల అనుసంధానం చేయగలిగితే దేశానికి తిరుగుండదన్నారు&period;<&sol;p>&NewLine;<p>నాడు ఉమ్మడి ఏపీలో తాము హైటెక్ సిటీ నిర్మిస్తుంటే దండగ అన్నారని&comma; కానీ ఇప్పుడు హైదరాబాద్ ఐటీకి అంతర్జాతీయ కేంద్రంగా నిలిచిందని సీఎం గుర్తుచేశారు&period; ఇప్పుడు అమరావతిని కూడా అద్భుతమైన నగరంగా నిర్మిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని విమర్శించారు&period; ప్రతిపక్షంలోని కొందరు రాజకీయం కోసం రైతుల్ని రెచ్చగొట్టి చివరకు సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు&period; ఆగస్టు 15 కల్లా సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వస్తుందని సీఎం స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>దేశంలో నదుల అనుసంధానం జరిగితే అద్భుతమైన అవకాశాలు ఉంటాయని&comma; గోదావరి-కావేరి అనుసంధానాన్ని కేఎల్ రావు నాడే ప్రతిపాదించగా&comma; వాజపేయి హయాంలో గంగా-కావేరి అనుసంధానం కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారన్నారు&period; ప్రస్తుతం వాగులు&comma; వంకలు&comma; నీటి ఊటలు అడుగంటిపోతున్న తరుణంలో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని&comma; రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.