ఏపీ లిక్కర్‌ రవాణా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.

ఏపీ లిక్కర్‌ రవాణా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

Advertisements

<p>ఏపీ లిక్కర్‌ రవాణా కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది&period; గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కేసులో ముగ్గురు కీలక నిందితులను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు ఈడీకి అనుమతినిచ్చింది హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు&period; వీరి విచారణ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది&period; నిందితుల్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవ రెడ్డి&comma; మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్&comma; రాజ్ కేసిరెడ్డి ఉన్నారు&period; ఈ ముగ్గురినీ గత జూన్ నెలలో అరెస్ట్ చేయగా&comma; అప్పటి నుంచి వారు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు&period; తాజాగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు&comma; నిందితులను మూడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;<p>గత ప్రభుత్వ హయాంలో APSBCL మద్యం రవాణా టెండర్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి&period; టెండర్ల నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా మార్చడం వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ&period;195 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ ప్రాథమికంగా అంచనా వేసింది&period; మనీలాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద ఈడీ ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది&period; ఈ నేపథ్యంలో ఈ కేసు నిందితులను ఈడీ కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది&period; దీంతో నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు నిందితులను విచారించనున్నారు&period; నిందితులు వాసుదేవరెడ్డి&comma; రాజ్‌కేసిరెడ్డి&comma; కారుమూరి సునీల్‌ను ఈడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు&period; మద్యం అక్రమ రవాణా&comma; నిధుల మళ్లింపు వ్యవహారంలో ఇతర భాగస్వాములకు ఉన్న సంబంధాలపై విచారించనున్నారు&period; వీరిని ప్రశ్నించడం ద్వారా ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు&comma; ఇతర కీలక లావాదేవీలకు సంబంధించి మరిన్ని ఆధారాలను బయటకు తీయవచ్చని ఈడీ అధికారులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.