ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క..

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క..

Advertisements

<p>ఇప్పటివరకు ఒక లెక్క&period;&period; ఇప్పటినుంచి ఒక లెక్క&period;&period; చాలా రోజుల తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ అజ్ఞాతం వీడారు&period; మెతక వైఖరిని పక్కనపెట్టి&period;&period; ప్రెస్ మీట్‌లో పొలిటికల్ తూటాలు పేల్చారు&period; ఎస్&period;&period; ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూట్ మార్చారు&period; ఇటు సొంత పార్టీకి&period;&period; అటు శత్రు పక్షానికి ఒకేసారి మైండ్ బ్లాక్ అయ్యేలా గట్టి వార్నింగ్ ఇచ్చారు&period; ఇప్పటివరకు ఎవరేం చెప్పినా ఓపిగ్గా విన్నా&period;&period; ఇకపై నేను చెప్పినట్టు మీరు వినాల్సిందే అంటూ క్లియర్ కట్ ఆర్డర్ పాస్ చేశారు డిప్యూటీ సీఎం సాబ్&period; వ్యూహం నాది&period;&period; ఆచరణ మీది&period;&period; ఇష్టం ఉంటే ఉండండి&comma; లేదంటే తప్పుకోండి అంటూ కుండబద్దలు కొట్టారు&period; శత్రువులు ఎక్కడో లేరు&period;&period; పార్టీలోనే ఉన్నారంటూ కోవర్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు&period; ఇదే సమయంలో వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు జనసేనాని&period; తాను శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతా&period;&period; నిలువునా పడిపోయిన బలహీనులను కొట్టను అంటూ వైసీపీకి కోలుకోలేని పంచ్ ఇచ్చారు&period; చేసిన తప్పులకి కర్మ ఎవరినీ వదిలిపెట్టదుంటూ జగన్ పేరు ఎత్తకుండానే గట్టి కౌంటర్ ఇచ్చారు&period; అలాగే దారినపోయే దానయ్యలంతా జనసేనపై రాళ్లు వేస్తామంటే&period;&period; ఇకపై తోలు తీస్తాం జాగ్రత్త అంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు జనసేనాని&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>ఇటీవల ఓ రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; తాను&comma; కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾ మాట్లాడుకుంటున్నప్పుడు జగన్ ను అరెస్ట్ చేయాలని కోరినట్లు&comma; దానికి అమిత్ à°·à°¾ తనపై క్లాస్ తీసుకున్నట్లు ఆ విశ్లేషకుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు&period; వైసీపీ నాయకులు జైలుకెళ్లాలని తామెందుకు కోరుకుంటామని&comma; ఆ నేత జైలుకెళ్తే జనసేన పార్టీ ఎదుగుతుందా అని ప్రశ్నించారు&period; కేంద్రహోంమంత్రి అమిత్ షాతో ఇలాంటి విషయాలు మాట్లాడతామా అని మండిపడ్డారు&period; ఇది వ్యవస్థను అవమానించడమేనని చెప్పారు&period; శత్రువు బలంగా ఉన్నప్పుడే దెబ్బ కొడతామని అన్నారు&period; రాష్ట్రాభివృద్ధి కోసమే తాము అమిత్ షాను కలిశామని స్పష్టత ఇచ్చారు&period; కర్మ ఎవరినీ వదిలిపెట్టదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు&period; తమ ఎదుగుదల కోసం ఇతరులను వాడుకోవద్దని పవన్ కల్యాణ్ సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..