అమరావతిలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి టెలీ కాన్పెరెన్స్.

Advertisements

<p>అమరావతిలో మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి&comma; కృష్ణా డెల్టాల ఇరిగేషన్ సీఈలు&comma; ఎస్‌ఈలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు&period;ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు&comma; ఈఎన్‌సీ నరసింహమూర్తి పాల్గొన్నారు&period;రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ఇరిగేషన్&comma; రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు&period; గతంలో ఎప్పుడూ లేని విధంగా సీలేరు జలాలను గోదావరి డెల్టా ఖరీఫ్ అవసరాల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు&period; పుష్కర కాలువ&comma; ఏలేరు వ్యవస్థ ద్వారా వచ్చే నీటిని తాగునీటి అవసరాలు&comma; ఆరుతడి పంటలకే వినియోగించాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ నీటితో తూర్పుగోదావరి&comma; కాకినాడ&comma; విశాఖ జిల్లాల్లో సుమారు 55 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు&period;గోదావరి డెల్టా రైతులు సాగును కొనసాగించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు మంత్రి వెల్లడించారు&period; డెల్టా మెరక ప్రాంత రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని&comma; అందుబాటులో ఉన్న నీటిని శాస్త్రీయంగా&comma; పొదుపుగా వినియోగించాలని సూచించారు&period;ప్రధాన కాలువల్లో కలుపు తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీటిని దుర్వినియోగం కాకుండా కృష్ణా డెల్టాకు చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు&period;గోదావరి&comma; ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖలో పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారుల సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు&period;నాగార్జునసాగర్‌కు ఈ సీజన్‌లో తగిన నీరు రాకపోతే 2027 జూన్ వరకు పులిచింతల&comma; పట్టిసీమ నీటిని తాగునీటి అవసరాలకే భద్రపరచాలని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.