నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్.

Advertisements

<p>నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్‌లో అధికారుల చేతివాటం తీవ్ర కలకలం రేపింది&period; స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలాది రూపాయల విలువైన టేకు కలపను ప్రభుత్వ డిపోకు తరలించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నించిన ఘటనా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది&period; వెలుగుడు రేంజ్ పరిధిలోని అప్పరాజుకుంట సెక్షన్ నుంచి అటవీ శాఖ సిబ్బంది ఇటీవల భారీగా టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు&period; అయితే ఈ కలపను నిబంధనల ప్రకారం ప్రభుత్వ డిపోకు పంపించాల్సి ఉండగా&comma; అధికారులే అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు&period; చెక్‌పోస్ట్ సిబ్బందికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా&comma; అటవీ శాఖకు చెందిన సొంత ట్రాక్టర్‌లోనే మోతకూరు గ్రామంలోని ఒక ప్రైవేట్ సామిల్‌కు రహస్యంగా తరలించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ రవాణాకు పాల్పడటంపై విచారణ చేపట్టగా అటవీ సిబ్బంది హస్తం ఉన్నట్లు ఆధారాలతో సహా నిరూపణ అయ్యింది&period; అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులే ఈ తరహా అక్రమాలకు పాల్పడటంపై డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ యాప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అంతర్గత విచారణ నివేదిక ఆధారంగా అక్రమాలకు బాధ్యులైన నలుగురు అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు&period; సస్పెండ్ అయిన వారిలో వెలుగుడు ఇన్ ఛార్జ్ రేంజర్ తాహిర్&comma; FSO వెంకటేశ్వర్లు&comma; FSO జయరాజ్&comma; FBO మయూరి ఉన్నారు&period; ఈ టేకు కలప అక్రమ రవాణా వ్యవహారంలో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఉన్నతాధికారులు విచారణను వేగవంతం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.