వైభవంగా గోదావరి పుష్కరాలు.

Advertisements

<p>గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు&period; వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి&period; ఈ సందర్భంగా 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు&period; పుష్కరాల కోసం రూ&period;4&comma;026 కోట్లతో 4&comma;932 పనులు చేపడుతున్నారు&period; భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 440 ఘాట్లను సిద్ధం చేస్తున్నారు&period; ఇందులో 259 పాత ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు 181 కొత్త ఘాట్లను నిర్మించనున్నారు&period;<&sol;p>&NewLine;<p>భక్తుల రద్దీ నియంత్రణ&comma; భద్రత కోసం అధునాతన సాంకేతికతను వినియోగించనున్నారు&period; ఏఐ క్రౌడ్‌ అనలిటిక్స్‌&comma; సీసీ కెమెరాలు&comma; డ్రోన్లు&comma; క్యూఆర్‌ ఆధారిత వాహన గుర్తింపు వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు&period; అత్యవసర వైద్య సేవల కోసం 30 తాత్కాలిక ఫీల్డ్‌ ఆస్పత్రులను అందుబాటులో ఉంచనున్నారు&period; అలాగే 2&comma;697 రెస్క్యూ బోట్లు&comma; 8&comma;955 మంది శిక్షణ పొందిన ఈతగాళ్లను సిద్ధంగా ఉంచనున్నారు&period; పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.