అనకాపల్లి జిల్లాలో కీలక నిర్ణయం.

Advertisements

<p>పర్యావరణ పరిరక్షణ&comma; చారిత్రక సంపద రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; అనకాపల్లి జిల్లాలోని ఆధ్యాత్మిక&comma; చారిత్రక ప్రాధాన్యం ఉన్న పంచధారల కొండల ప్రాంతాన్ని &OpenCurlyQuote;నో మైనింగ్ జోన్’గా ప్రకటించింది&period; దీంతో ఈ ప్రాంతంలో తవ్వకాలు&comma; క్వారీ పనులపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది&period; మైనింగ్ వల్ల జీవవైవిధ్యంతో పాటు శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం&comma; సహజ పుణ్యతీర్థ జలధారలకు ముప్పు ఉందంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది&period;<&sol;p>&NewLine;<p>తవ్వకాలతో పర్యావరణ సమతుల్యత&comma; చారిత్రక కట్టడాలకు నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు నిర్ధారించారు&period; దీంతో గతంలో మంజూరైన 2&period;153 హెక్టార్ల క్వారీ లీజు అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది&period; కొండల సహజ రూపురేఖలు&comma; జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక భక్తులు&comma; పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.