రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పీవీఎన్‌ రాజు లీలలు..

రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పీవీఎన్‌ రాజు లీలలు

Advertisements

<p>జీతం ఒకచోట&period;&period; గీతం మరోచోట అన్నట్లుగా మారింది&&num;8230&semi; రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేశ్వర్ రాజు వ్యవహారం&period; ప్రభుత్వ విధులకు నిర్లక్ష్యం వహిస్తూ వారానికి ఒక్కరోజు మాత్రమే డ్యూటీకి హాజరవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; మిగిలిన రోజుల్లో ఆళ్లగడ్డలోని తన సొంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు&period; ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విధులకు గైర్హాజరవుతున్న పలువురు ప్రభుత్వ డాక్టర్లపై చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం&comma; రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వ్యవహారంపై ఎందుకు మౌనం వహిస్తోందని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు&period; రాజంపేట జాతీయ రహదారిపైనే ఉండడం&&num;8230&semi; రోజూ ప్రమాదాల బారిన పడిన ఎమర్జెన్సీ కేసులు వస్తున్నప్పటికీ ఆసుపత్రిలో కీలక అధికారి అందుబాటులో లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది&period; సూపరింటెండెంట్ నాగేశ్వర్ రాజుపై ఇప్పటికే జిల్లా DCHS అధికారి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<p>రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గైర్హాజరు కారణంగా వైద్య సేవలు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు&period; ఆసుపత్రి పరిపాలనను పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్ నాగేశ్వర్ రాజుకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పూర్తి సహకారం అందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి&period; ప్రభుత్వ వేతనం తీసుకుంటూనే సొంత ఆసుపత్రి నిర్వహణపై దృష్టి పెట్టడం నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు &period; ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిపై దృష్టి సారించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు&period; పేద ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజంపేట ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..