టీడీపీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన వేమిరెడ్డి దంపతులు..

టీడీపీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన వేమిరెడ్డి దంపతులు

Advertisements

<p>అమరావతిలో జరుగుతున్న టీడీపీ మహానాడుకు తొలిరోజే విరాళాలు వెల్లువెత్తాయి&period; పార్టీకి ఆర్థికంగా అండగా నిలుస్తూ పలువురు నేతలు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు&period; ముఖ్యంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి&comma; ఆయన భార్య&comma; ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి 5 కోట్ల భారీ విరాళం ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు&period; వీరి ప్రకటన మహానాడులో ప్రధాన హైలైట్‌గా నిలిచింది&period; వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ క్లస్టర్ నెం&period;3 మహానాడులో పాల్గొనగా&comma; ప్రశాంతి రెడ్డి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలోని మహానాడులో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>తొలిరోజు మహానాడు ముగిసేసరికి పార్టీకి సుమారు 12 కోట్ల విరాళాలు అందాయి&period; వేమిరెడ్డి దంపతుల తర్వాత ఎంపీ సానా సతీష్ 1&period;5 కోట్లు ప్రకటించారు&period; అలాగే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి&comma; ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి&comma; భాష్యం రామకృష్ణ తలో కోటి రూపాయల చొప్పున విరాళం అందించారు&period; మరోవైపు&comma; మహానాడులో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలపై 48 మంది నేతలు ప్రసంగించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు&period;<br &sol;>&NewLine;తమ ప్రభుత్వం అమలు చేస్తున్న &&num;8216&semi;సూపర్ సిక్స్&&num;8217&semi; పథకాలు సూపర్ పవర్‌లా పనిచేస్తున్నాయని&comma; దీనిని చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేక దుష్ప్రచారం చేస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపించారు&period; మహానాడు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు&period; ఏ పేదవాడి ఇంటికి వెళ్లి చూసినా సూపర్ సిక్స్ పవర్ తెలుస్తుందని ఆమె అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరిస్తూ&comma; తల్లికి వందనం కింద 67&period;27 లక్షల మంది విద్యార్థులకు 10 వేల 90 కోట్లు అందించామని&comma; గత ప్రభుత్వం కేవలం 42 లక్షల మందికే ఈ పథకాన్ని పరిమితం చేసిందని తెలిపారు&period; &&num;8220&semi;అన్నదాత సుఖీభవ&&num;8221&semi; ద్వారా 46&period;85 లక్షల మంది రైతులకు 8 వేల 985 కోట్లు ఇచ్చామని&comma; ఏడాదికి 20 వేల పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు&period; స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 63 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు&period; దీపం-2 ద్వారా 4 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు&period; ప్రతినెలా ఒకటో తేదీన ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తుంటే లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు&period; యువగళం ద్వారా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి&comma; 24 లక్షల ఉద్యోగాల కల్పనకు బాటలు వేశామని ప్రశాంతి రెడ్డి తెలిపారు&period; డీఎస్సీ నియామకాలు&comma; పరిశ్రమల ఏర్పాటు&comma; స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలతో యువతకు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తున్నామని ఆమె ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..