రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..

రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..

Advertisements

<p>రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు&period; పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు&period; ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ &&num;8216&semi;స్బేర్ బ్యాంక్&&num;8217&semi; వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు&period; ఈ సందర్భంగా ఏపీలో సాంకేతిక&comma; ఆర్థిక రంగాల విస్తరణపై కీలక చర్చలు జరిపారు&period;స్బేర్ బ్యాంక్‌కు చెందిన &&num;8216&semi;గిగావాట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్&&num;8217&semi; సేవలను భారతదేశంలో&comma; ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు&period; అలాగే సైబర్ నేరాల నియంత్రణకు గానూ &&num;8216&semi;యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్‌&&num;8217&semi; కోసం సాంకేతిక సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు&period; వీటితో పాటు ఏపీలోని ఫార్మా&comma; అగ్రి ఎక్స్‌పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించేలా చొరవ చూపాలని లోకేష్ కోరారు&period; ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు రష్యా బ్యాంకింగ్ దిగ్గజం సహకారం అందించాలని ఆయన ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.

విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!

భారత్‌కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్‌.