“సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వీఎన్ ఆదిత్య చేతుల మీదుగా "సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Advertisements

<p>తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు&comma; కుల వివక్ష&comma; అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న &OpenCurlyQuote;సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా విడుదల చేశారు&period; ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ&comma; తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>శ్రీరామ్ నిమ్మల&comma; వర్షిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి లారా దర్శకత్వం వహిస్తుండగా&comma; తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు&period; తెలంగాణలో 80 దశకంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు&period; ఈ సందర్భంగా<&sol;p>&NewLine;<p>తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ &&num;8211&semi; &OpenCurlyDoubleQuote;నీటి సమస్య అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు&period; ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు&period; అలాంటి కీలకమైన అంశాన్ని కథాంశంగా తీసుకుని సినిమా రూపొందించడం ఆనందంగా ఉంది&period; ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి&period; ఈ సినిమాలో నటించిన హీరోయిన్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాను&period; చిత్ర యూనిట్‌కు నా హృదయపూర్వక అభినందనలు” అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;సర్కారు బాయి&&num;8221&semi; కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంది&period; ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు&period; మంచి కథతో వచ్చే సినిమాలను ఆదరిస్తున్నారు&period; ఇలాంటి సబ్జెక్టులతో సినిమాలు నిర్మించే నిర్మాతలు ఉండటం పరిశ్రమకు గొప్ప విషయం&period; నా అభిమాన క్రికెటర్ లారా లాగానే దర్శకుడు లారా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;తెలంగాణ సాయుధ పోరాటం&comma; సామాజిక అంశాలతో కూడిన కథలంటే నాకు ఎంతో ఇష్టం&period; అలాంటి కథలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను&period; నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు లారా గారికి కృతజ్ఞతలు&period; నిర్మాత ప్రఫుల్ రాంరెడ్డి మాకు కుటుంబ పెద్దలాంటివారు&period; ఈ చిత్రంలో భాగస్వామి కావడం గర్వంగా ఉంది” అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ వర్షిక మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;నేను తెలుగమ్మాయిని&period; ఇలాంటి మంచి కథలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు&period; ఈ కథ విన్న వెంటనే ఇది జాతీయ అవార్డు స్థాయి సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది&period; ప్రేక్షకులందరూ ఈ చిత్రానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు లారా మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;చరిత్రలో మరుగున పడిపోయిన ఓ భావోద్వేగ కథను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం&period; &OpenCurlyQuote;సర్కారు బాయి’ వద్ద అణగారిన వర్గాలకు నీళ్లు ఇవ్వకుండా జరిగిన అన్యాయాలు&comma; వారు ఎదుర్కొన్న కష్టాలు&comma; కన్నీటి గాథ ఈ చిత్రానికి మూలకథ&period; 1985లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు&comma; కుల వివక్ష&comma; సామాజిక అసమానతలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం&period; తెలంగాణలో జరిగిన ఓ హృదయ విదారక సంఘటనను తెరపై ఆవిష్కరిస్తున్నాం&period; ప్రేక్షకుల ఆదరణ కోరుకుంటున్నాం” అని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం&period; సమాజానికి సందేశాన్ని అందించే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని నమ్ముతున్నాను&period; త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం&period; ప్రముఖ నటీనటులతో ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మిస్తున్నాం&period; అవార్డులు సాధించే స్థాయి చిత్రంగా నిలుస్తుంది&period; అలాగే ఈ చిత్రంలో ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి&period; మా చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు చిట్టిబాబు మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;ఈ సినిమాలో నాకు మంచి పాత్ర దక్కింది&period; &OpenCurlyQuote;సర్కారు బాయి’ అనే టైటిల్‌నే చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్&period; సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు మోహన్ బైరాగి మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;ఉద్యమాల నుంచి వచ్చిన ఆలోచనలతో ఈ సినిమా రూపొందుతోంది&period; సామాజిక బాధ్యతతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది” అని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>కో-ప్రొడ్యూసర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది&period; పెద్ద విజయాన్ని అందుకుంటుందనే పూర్తి నమ్మకం ఉంది” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది&period;<&sol;p>&NewLine;<p>నీటి హక్కు&comma; సామాజిక సమానత్వం&comma; కుల వివక్ష వ్యతిరేక పోరాటం వంటి అంశాలను హృద్యంగా ఆవిష్కరించనున్న &OpenCurlyQuote;సర్కారు బాయి’ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.