అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో ఉద్రిక్తత

Advertisements

<p>డ్రోన్‌లు&comma; క్షిపణులతో పశ్చిమాసియా మరోసారి దద్దరిల్లింది&period; శాంతి చర్చలు కొనసాగుతుండగానే అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష ఘర్షణలు చోటుచేసుకున్నాయి&period; కువైట్&comma; బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగగా&period;&period; వాటిని తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు ఆయా దేశాలు ప్రకటించాయి&period; ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ తెలిపింది&period; ఇరువైపులా ఆరోపణలు&comma; ప్రతిఆరోపణలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది&period; అమెరికా&comma; ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొత్త మలుపు తిరిగాయి&period; కువైట్‌లోని అల్ సలేం వైమానిక స్థావరం&comma; బహ్రెయిన్‌లోని ఈసా ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు&comma; డ్రోన్‌లతో దాడులకు దిగింది&period;కువైట్ వ్యాప్తంగా తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు&period; ఇరాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు&comma; డ్రోన్‌లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ప్రకటించింది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు బహ్రెయిన్‌లో కూడా ప్రమాద హెచ్చరిక సైరన్‌లు మోగాయి&period; వెంటనే సైన్యం అప్రమత్తమై భద్రతా చర్యలను ముమ్మరం చేసింది&period; ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది&period;ఖేష్మ్ ద్వీపంలోని తమ సైనిక స్థావరాలపై అమెరికా దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వెల్లడించింది&period; దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు శత్రువుల స్థావరాలపై మరింత తీవ్ర చర్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది&period;<&sol;p>&NewLine;<p>బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ ఐదో ఫ్లీట్ ప్రధాన కార్యాలయం&comma; మరో వైమానిక స్థావరంపై విజయవంతంగా దాడులు జరిపినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది&period; అయితే ఈ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ పూర్తిగా ఖండించింది&period;ఇరాన్ చేపట్టిన దాడులన్నీ విఫలమయ్యాయని&comma; తమ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని అమెరికా సెంట్‌కామ్ స్పష్టం చేసింది&period; ఖేష్మ్ ద్వీపంపై జరిపిన దాడులు పూర్తిగా ఆత్మరక్షణ కోసమేనని పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.