భారత్‌పై అమెరికా మరో బాంబ్‌..

భారత్‌పై అమెరికా మరో బాంబ్‌

Advertisements

<p>భారత్‌కు అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది&period; అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం విడుదల చేసిన తాజా నివేదికలో భారత్‌ను దోషుల జాబితాలో చేర్చింది&period; ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్-301 కింద నిర్వహించిన దర్యాప్తుల్లో భారత్ సహా 54 దేశాలు బలవంతపు శ్రమతో తయారయ్యే వస్తువుల దిగుమతులను అరికట్టడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని యూఎస్‌టిఆర్ పేర్కొంది&period; ఈ నివేదిక ఆధారంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై 10 నుంచి 12&period;5 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది&period; ఇప్పటికే పరిమిత ఆంక్షలు అమలు చేస్తున్న దేశాలకు 10 శాతం టారిఫ్ ఉండగా&period;&period; భారత్&comma; చైనా&comma; జపాన్&comma; దక్షిణ కొరియా&comma; బ్రెజిల్ వంటి దేశాలకు గరిష్టంగా 12&period;5 శాతం సుంకం విధించే అవకాశం ఉందని తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>టెక్స్‌టైల్స్&comma; వస్త్ర ఉత్పత్తుల విషయంలో మాత్రం ప్రత్యేక కోటా విధానంతో కొంత ఉపశమనం కల్పించేందుకు అమెరికా సిద్ధమైంది&period; అయితే ఈ ప్రతిపాదిత సుంకాలు అమలైతే భారత ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్లో పెరిగే అవకాశం ఉంది&period; దీంతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని నిపుణులు భావిస్తున్నారు&period; ఇదిలా ఉండగా&period;&period; న్యూఢిల్లీలో భారత్-అమెరికా ఉన్నతాధికారులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది&period; ప్రతిపాదిత టారిఫ్‌లపై జులై తొలి వారం వరకు ప్రజాభిప్రాయ సేకరణ&comma; సమీక్షలు నిర్వహించి&period;&period; అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.