ఏపీలో నిప్పులు కురుస్తున్న ఎండలు…..

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌ను నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి ఎండలు&period; అగ్నిగోళంలా మారుతున్న భానుడి భగభగలకు రాష్ట్రం విలవిలలాడుతోంది&period; నేడు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 73 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది&period; ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల వరకు సెగలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు&period; జిల్లాల వారీగా చూస్తే&period;&period; విజయనగరంలో 24&comma; శ్రీకాకుళంలో 16&comma; మన్యంలో 15 మండలాలపై వడగాల్పుల పంజా విసరనున్నాయి&period; ఇప్పటికే పార్వతీపురం మన్యంలో 41&period;8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది&period; రానున్న 48 గంటలు అత్యంత కీలకం కానున్నాయి&period;<&sol;p>&NewLine;<p>వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు&period; ముఖ్యంగా వృద్ధులు&comma; గర్భిణులు&comma; చిన్నారులు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు&period; డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు కొబ్బరి నీళ్లు&comma; మజ్జిగ&comma; ఓఆర్‌ఎస్‌లను విరివిగా తీసుకోవాలని కోరుతున్నారు&period; పోలవరం&comma; అల్లూరి&comma; అనకాపల్లి జిల్లాల్లోనూ ఎండల తీవ్రత భయంకరంగా ఉండబోతోంది&period; సాధారణ వడగాలుల ప్రభావం మరో 17 మండలాల్లో ఉండనుండగా&period;&period; ఆదివారం కూడా 30కి పైగా మండలాల్లో తీవ్ర ఎండలు ఉంటాయని అంచనా&period; ఎండ తీవ్రతను బట్టి ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం&period; రాయలపేట నుంచి నాతవరం వరకు&period;&period; భామిని నుంచి కాకినాడ వరకు ఎక్కడ చూసినా ఎండలు దంచి కొడుతున్నాయి&period; మే నెల రాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు&period; ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను పాటిస్తూ&period;&period; అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.