ఉదయం టిఫిన్ మానేయడం వల్ల లేదంటే కావాలని తినకుండా ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. టిఫిన్ మానేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఉండటం వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం. శరీరం బలహీనంగా అనిపిస్తుంది. శక్తి లేకపోవడం వల్ల మీరు రోజంతా అలసిపోతారు. ఉత్పాదకత పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. టిఫిన్ తీసుకోకపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోయి శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. శరీరంలో పోషకాల లోపం వల్ల వచ్చే వ్యాధులు వస్తాయి. కోపం పెరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అధిక మొత్తంలో ఒత్తిడి హార్మోన్ల కారణంగా మానసిక స్థితి క్షీణిస్తుంది. దీనివల్ల చికాకు కలుగుతుంటుంది.
ఉదయం టిఫిన్ మానేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు!
100
previous post