నడుము నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే!

Are you suffering from back pain

Advertisements

&NewLine;<p>ప్రస్తుత కాలంలో ఎవరిని పలకరించినా కూడా నొప్పులు ఉన్నాయని బాధపడుతూనే ఉంటారు&period; చిన్నా&comma; పెద్దా అని వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ నడుము నొప్పి అనేది ఎక్కువ బాధ కలిగిస్తుంది&period; ఈ పోటీ ప్రపంచంలో అసలే గంటల తరబడి కూర్చుని పనులు చేయడం ద్వారా ఎక్కువ శాతం నడుము నొప్పికి గురవుతున్నారు&period; ఎన్ని రకాల మందులు వాడినా అప్పటికీ మాత్రమే ఉపశమనం కలుగుతుంది&period; మరి నడుము నొప్పిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం&period; కొద్దిగా అల్లంను తీసుకుని దానిని మెత్తగా రుబ్బి నొప్పి ఉన్నచోట అప్లై చేయాలి&period; ఒక ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత మీకు నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది&period; అలాగే కొన్ని అల్లం ముక్కలను బాగా మరిగించి&comma; ఆ నీటిని చల్లార్చిన తర్వాత ఒక రెండు స్పూన్ల తేనెను కలుపుకుని తాగడం ద్వారా తొందరగా నడుము నొప్పి తగ్గు ముఖం పడుతుంది&period; ఇది పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు&period; కొద్దిగా ఆవ నూనె&comma; నువ్వుల నూనె రెండు సమపాళ్లలో కలుపుకుని&comma; గోరువెచ్చగా నూనెను వేడిచేసి నొప్పి ఉన్న చోట బాగా మర్దన చేయడం ద్వారా నడుము నొప్పితో పాటు ఇంకా ఏ రకమైన కీళ్ల నొప్పులు ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి&period; శొంఠి బాగా నూరి ఒక మిశ్రమంలా తయారు చేసుకొని నొప్పి ఉన్నచోట పట్టాలా వేసుకోవాలి&period; దీనిపై తెల్ల జిల్లేడు ఆకులను పెట్టి కట్టు కట్టడం ద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు&period; ఇలా తరచూ చేస్తూ ఉండటం ద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; ద్విచక్ర వాహనాలు నడిపేవారు నిటారుగా కూర్చొని నడపడం&comma; ఆఫీసులో వర్క్ చేసేవారు రెండు కాళ్లు సమాంతరంగా నేలకు ఉండేలా చూసుకోవాలి&period; వెన్నును వంచకుండా నిటారుగా ఉండేలా కూర్చోవాలి&period; ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా గంటకు ఒక సారైనా లేచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి&period; ఇలా చేయడం ద్వారా నడుము నొప్పి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి&period; వీటితోపాటు బలమైన ఆహారం తీసుకోవడం ద్వారా నడుము నొప్పి రాకుండా నివారించుకోవచ్చు&period; అందులో మినప్పప్పు చాలా ముఖ్యమైనది&period; ఇందులో ఉన్న ఫైబర్&comma; విటమిన్స్&comma; ప్రొటీన్లు&comma; శరీరానికి మంచి పోషణ కలిగిస్తాయి&period; ఈ పప్పు ఎముకల్లో బలాన్ని చేకూరుస్తుంది&period; వీటితో పాటు పండ్లు&comma; క్యాల్షియం అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా నడుము నొప్పి నుంచి నివారణ పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు