పీరియడ్స్ టైమ్‌లో చాలా మంది మహిళలు కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, వాంతులు, కళ్లు తిరగడం, నీరసం, చికాకు, తిమ్మిర్లు లాంటి సమస్యలు కారణంగా ఇబ్బంది పడుతుంటారు. పీరియడ్స్ టైమ్‌లో పసుపు పాలు తాగితే అనేక లాభాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు పాలు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. దీన్ని గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. పసుపులో విటమిన్లు, మినరల్స్, మాంగనీస్, ఐరన్, ఫైబర్, విటమిన్ బి6, కాపర్, పొటాషియం ఉంటాయి. రోజూ పసుపును ఆహారంలోకి చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన దానిలో పది శాతం ఐరన్ అందుతుంది. తగిన మోతాదులో ఇనుము లభించడం వల్ల హిమోగ్లోబిన్, కొత్త రక్తకణాలు ఉత్పత్తికి అవకాశం కలుగుతుంది. పసుపు రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పసుపు పాలు తాగితే శరీరంలో వాపు, మంట తగ్గుతుంది. ధమనులు దెబ్బతినకుండా రక్షిస్తుంది. పసుపులోని కర్కుమిన్ కొలెస్ట్రాల్‌ను 30%, ట్రైగ్లిజరైడ్లను 40% తగ్గిస్తుంది. రక్త ప్రసరణ స్థాయిని మెరుగుపరుస్తుంది. అథెరోస్క్లెరోసిస్ అని పిలిచే ధమనులు గట్టిపడకుండా చూసుకుంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతాయి. పసుపు పాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి టైప్ 2 డయాబెటిస్ ముప్పు కూడా తగ్గిస్తాయి. ప్రతిరోజూ తగినంత విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది అండాశయాలలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచి హార్మోన్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. పసుపు పాలు తాగితే కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, వాంతులు, కళ్లు తిరగడం, నీరసం, చికాకు, తిమ్మిర్లు లాంటి సమస్యలు నుంచి బయటపడవచ్చు. పసుపు పాలు తాగితే నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా చేస్తాయి.
పీరియడ్స్ టైమ్‌లో కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ పాలు తాగండి!
93
previous post