చలికాలంలో ఉదయాన్నే చల్లటి నీళ్లు శరీరంపై పడగానే ఒళ్లు బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది. చన్నీటి స్నానం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న నోర్పైన్ఫ్రైన్ను విడుదల చేస్తుందని నిపుణులు అంటున్నారు. చన్నీటి స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చన్నీటిలో స్విమ్మింగ్ చేసేవారికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. చిన్నీటి స్నానం శరీరా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ అద్భుత ప్రయోజనాలు పొందడానికి చన్నీటి స్నానం చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. చన్నీటి స్నానం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఒక క్రమపద్ధతిలో రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఉంటాయి. అలాగే ధమనుల్లో కూడా రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చన్నీటి స్నానం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఈ క్రమంలో శరీరంలోని మలినాలు, విష పదార్థాలను సులభంగా తొలగిస్తుంది. క్రమం తప్పకుండా చల్లటి స్నానం చేసే వ్యక్తుల్లో జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. వీరి శరీరంలోని గోధుమ కొవ్వు కణజాలం, మంచి కొవ్వు యాక్టివ్గా ఉంటాయి. దీనితో శరీరంలో వేడి పెరుగుతుంది, చల్లని ఉష్ణోగ్రతల నుంచి రక్షణ లభిస్తుంది. తద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది. చన్నీటి స్నానం జీవక్రియను మెరుగుపరచి, శరీరంలో కొవ్వు త్వరగా కరిగేలా సహాయపడుతుంది.
చన్నీటి స్నానం చేస్తున్నారా..!
86
previous post