అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

Advertisements

<p>ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా తయారైంది &period; అత్యవసర వేళలో ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆర్ఎంపీ డాక్టర్లు ఏకంగా ఎంబిబిఎస్ డాక్టర్లతో సమానంగా తెలిసి తెలియని వైద్యం ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు&period; జిల్లాలోని ముఖ్య పట్ఠణాలు &comma; మండల కేంద్రాలలో ప్రతి వీధిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ పుట్టుకొచ్చారు &period; కొంత మంది కనీస విద్యార్హత లేకుండా&comma; ఆర్&period;ఎం&period;పి డాక్టర్ సర్టిఫికెట్ కూడా లేకున్నా క్లినిక్లను ఏర్పాటు చేసుకొని వైద్యం అందిస్తున్నారు&period; అవగాహన లేకుండా ఇష్టానుసారంగా రోగులకు స్టెరాయిడ్స్&comma; యాంటీ బయాటిక్ లు &comma; ఇతర ప్రమాదకర మెడిసిన్ అందిస్తూ ప్రాణాలను గాల్లో కలుపుతున్నారు&period; కేవలం ప్రథమ చికిత్స చేసి వైద్యుని దగ్గరికి పంపాల్సిన ఆర్ఎంపీలు వీళ్లే వైద్యునిగా భావించి వారికి చిన్న చిన్న శస్త్ర చికిత్సలు సైతం చేసేస్తున్నారు&period; తొందరగా రోగం నయం అయ్యే విధంగా పరిమితికి మించి స్టెరాయిడ్స్&comma;యాంటిబయాటిక్స్ అందిస్తూ సత్వర ఫలితం వచ్చే విధంగా చేస్తున్నారు&period; దాంతో అమాయక గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్ఎంపీలు ఇచ్చే స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ కు అలవాటు పడి వారి వద్దకే ప్రతి వ్యాధికి చికిత్స కోసం ఎగబడుతున్నారు<&sol;p>&NewLine;<p>అనంతపురం జిల్లా కేంద్రంలో ఆరోగ్య సేవల పేరుతో ప్రమాదకర పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి&period; ప్రథమ చికిత్స కేంద్రాలు వేగంగా పెరుగుతుండగా&comma; వాటిలో చాలా వరకు కనీస అర్హతలు లేకుండా నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; స్టెతస్కోప్ పట్టుకుని వైద్యుల్లా వ్యవహరిస్తున్న ఆర్ఎంపీలు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి&period; చిన్న జబ్బుల నుంచి మైనర్ సర్జరీల వరకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం ఉండటం మరింత భయానకంగా మారింది&period; తక్కువ ఖర్చుతో త్వరగా చికిత్స అందిస్తామని చెప్పి ప్రజలను ఆకర్షిస్తున్నప్పటికీ&comma; అందుతున్న సేవల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి&period; ఇప్పటికే అనధికారిక మందులు తీసుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నప్పటికీ&comma; అధికారుల నుంచి గట్టి చర్యలు కనిపించడం లేదు&period; హోమియోపతి చదివిన కొంతమంది అల్లోపతి వైద్యం చేయడం కూడా నిబంధనలకు విరుద్ధం&period; అయినా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పందించకపోవడం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది&period; ఇప్పటికైనా అనధికారిక క్లినిక్‌లపై కఠిన చర్యలు తీసుకుని&comma; ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆర్ఎంపీ డాక్టర్ అంటే తమ వద్దకు వచ్చిన రోగులకు ప్రథమ చికిత్స చేసి వేరే ఆసుపత్రికి రిఫర్ చేయాలి &period; కానీ హిందూపూర్ లో మాత్రం ప్రథమ చికిత్స పరిధిని దాటి ఆర్ఎంపీలు వైద్యం అందిస్తున్నారు &period; వారి దగ్గరికి వెళ్లిన వారందరికీ సెలైన్ ఎక్కించడం&comma; ఇంజక్షన్ వేయడంతో పాటు పెద్ద పెద్ద చికిత్సలు చేస్తున్నారు &period; లేడీ ఆర్ఎంపి డాక్టర్ అయితే గర్భిణీలకు కాన్పులు కూడా చేసేస్తున్నారు&period; చిన్నపిల్లల విషయానికొస్తే ఎంబిబిఎస్ &comma; పీజీ చేసిన డాక్టర్లు కూడా చేయని వైద్యం ఆర్ఎంపీలు చేసేస్తున్నారు&period; చిన్నారులకు స్టెరాయిడ్స్ &comma; యాంటీబయోటిక్స్ సెలైన్ వంటి వాటిని వినియోగిస్తున్నారు&period; చిన్నపిల్లల ప్రాణాలు అతి సున్నితమైనవి అయినా కూడా వారు ఏమాత్రం భయపడకుండా ప్రమాదకరమైన వైద్యాన్ని అందిస్తున్నారు&period; ఇటువంటి ఆర్ఎంపి క్లినిక్లు మినీ నర్సింగ్ హోమ్ గా చెలామణి ఆవుతున్నాయి&period; ఆర్ఎంపీల వద్దకు వచ్చే రోగుల సంఖ్యను బట్టి వారికి అసిస్టెంట్లుగా నర్సులను కూడా ఏర్పాటు చేసుకున్న వైనం హిందూపూర్ లో చోటుచేసుకుంది &period; ఆర్ఎంపీ క్లినిక్ లో బెడ్లు ఏర్పాటు చేయడం ఒకటి రెండు రోజులు అక్కడే రోగులను ఉంచుకోవడం చేస్తున్నారు&period; ఇలాంటి ఆర్ఎంపీ క్లినిక్లు హిందూపురం నియోజకవర్గంలో 245 ఉన్నాయి&period; ఇంత పెద్ద ఎత్తున ఆర్ఎంపీ క్లినిక్లలో ప్రమాదకరమైన వైద్యం జరుగుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు&period; ఇటీవల జిల్లా కలెక్టర్ స్వయంగా ఆర్ఎంపీ క్లినిక్ లోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు&period; కలెక్టర్ తనిఖీల్లో సైతం నెవ్వరపోయే విషయాలు బయటకు వచ్చాయి&period; నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆర్ఎంపి క్లినిక్లను ఆయన స్వయంగా తనిఖీలు చేసి సీజ్ చేసిన విషయం తెలిసిందే&period; ప్రజారోగ్యం పట్ల ఎవరు అక్రమాలకు పాల్పడినా కఠినంగా శిక్షలు ఉంటాయని&comma; ఆర్ఎంపీలు హద్దులు దాటి వైద్యం అందించకూడదని జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>మరో వైపు జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో ఆర్ఎంపీ క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి &period; ప్రాథమిక చికిత్సకే పరిమితమవాల్సిన ఆర్ఎంపీలు&comma; పరిమితులు దాటి ఇంజక్షన్లు వేయడం&comma; సెలైన్ బాటిళ్లు ఎక్కించడం వంటి వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; గతంలో కూడా ఆర్ఎంపీల నిర్లక్ష్య వైద్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి&period; పట్టణంలో ఆర్&period;ఎం&period;పి &period;à°² వద్ద చికిత్స వికటించి ముగ్గురు మరణించిన దాఖలాలు ఉన్నాయి &period;అయినప్పటికీ&comma; ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది&period;ఆర్ఎంపీల వద్ద చికిత్స సమయంలో ఇంజక్షన్లు&comma; స్టెరాయిడ్లు&comma; హెవీ డోసులు ఇవ్వడం వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణిస్తున్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; అంతేకాకుండా&comma; కొంతమంది ఆర్ఎంపీలు సొంతంగా ల్యాబ్‌లు కూడా నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి&period; జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేవలం నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు&period; బాధిత కుటుంబాలకు డబ్బులు ఇచ్చి కేసులు బయటపడకుండా చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి&period; ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలని బాధితులు పలుమార్లు రోడ్డెక్కినా ఫలితం లేకపోయింది&period; చంటి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రమాదకర ఇంజక్షన్లు ఇస్తూ ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<br &sol;>&NewLine;ఇలాంటి అక్రమ వైద్య కార్యకలాపాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇంకో వైపు జిల్లాలోని తాడిపత్రిలో మరో ఘోర దుర్ఘటన జరిగింది &period; వరహాలు తోట రంగప్ప కాలనీకి చెందిన ఒక మహిళ ఇటీవల కడుపులో మంట&comma; కళ్ళు తిరగడంతో స్థానిక బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న ఒక ఆర్&period;ఎం&period;పి క్లినిక్‌కు వెళ్లారు&period;&ZeroWidthSpace;రోగి పరిస్థితిని గమనించిన ఆ ఆర్&period;ఎం&period;పి&comma; ఆమెకు బీపీ తక్కువగా ఉందని నిర్ధారించి&period;&period; తానే స్వయంగా ఐవీ ఫ్లూయిడ్స్ తో పాటు మెట్రోజిల్&comma;పాంటోప్ వంటి ఇంజెక్షన్లను ఎక్కించారు&period;అయితే&comma; నిబంధనల ప్రకారం ఇటువంటి వైద్యం చేయడానికి లేదా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి సదరు ఆర్&period;ఎం&period;పి కి ఎటువంటి అర్హత లేదు&period;మందులు ఎక్కించిన కొద్ది సేపటికే ఆ మహిళకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది&period;పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమెను తాడిపత్రి ఏరియా ఆసుపత్రికి తరలించారు&period;కానీ దురదృష్టవశాత్తూ&comma;ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు&period;ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది&period;ఈ ఘటన వెలుగులోకి రాకుండా సదరు ఆర్&period;ఎం&period;పి భారీ ప్రయత్నాలే చేసినట్లు సమాచారం బాధితురాలి కుటుంబ సభ్యులకు కొంత డబ్బు ఆశ చూపి&comma; &&num;8216&semi;దుప్పటి పంచాయితీ&&num;8217&semi; ద్వారా కేసును అణచివేయాలని చూసినట్లు విశ్వసనీయ సమాచారం&period;<&sol;p>&NewLine;<p>జిల్లా వైద్య &comma;ఆరోగ్య శాఖాధికారి ప్రాథమిక విచారణ జరిపి క్లినిక్ సీజ్ చేయాలని షోకాజ్ నోటీసులు జారీ చేసారు&period;అయినా కూడా ఏమి పట్టనట్టు ఆ RMP ప్రభుద్దుడు ఇప్పటికి క్లినిక్ కి వచ్చిన రోగులకు సూది మందులు వేస్తూ ఉండడం విస్మయానికి గురిచేస్తుంది &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..