మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..

Advertisements

<p>హృదయాన్ని కదిలించే విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది&period;బోటు ప్రమాదంలో ఓ తల్లి చూపించిన ప్రేమ&period;&period; అందరినీ కంటతడి పెట్టిస్తోంది&period;కళ్ల ముందు మృత్యువు కనిపిస్తున్నా తన చిన్నారి కొడుకును కాపాడుకోవాలని ఆ తల్లి చివరి క్షణం వరకు పోరాడింది&period;మరణం అంచున ఉన్నా ఆ పసివాడిని గుండెలకు హత్తుకుని రక్షించేందుకు ప్రయత్నించింది&period;కానీ విధి వేరుగా తీర్పు చెప్పింది&period;తన కుమారుడిని కాపాడుకోలేక ఆ తల్లి కన్నీళ్లు ఆమెతో పాటే కడలిలో కలిసిపోయాయి&period;మధ్యప్రదేశ్‌ బోటు ప్రమాదంలో కనిపించిన ఈ హృదయ విదారక దృశ్యం చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది&period;<&sol;p>&NewLine;<p>జబల్‌పూర్‌లోని బర్గి డ్యామ్‌లో గురువారం సాయంత్రం పడవ బోల్తా పడిన ఘటనలో పలువురు గల్లంతైయ్యారు&period;వారికోసం శుక్రవారం ఉదయం కూడా సహాయక చర్యలు కొనసాగాయి&period; ఈ క్రమంలోనే ఓ తల్లీబిడ్డల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించి నీటి నుంచి వెలికితీశారు&period; నాలుగేళ్ల చిన్నారిని తల్లి అదిమిపట్టుకోగా వారి చుట్టూ లైఫ్‌ జాకెట్‌ ఉంది&period; నీటిలో మునిగిపోయే సమయంలో కుమారుడిని కాపాడటం కోసం ఆ తల్లి పడిన వేదనను తలుచుకుని అక్కడున్న వారు కదిలిపోయారు&period;<&sol;p>&NewLine;<p>జబల్‌పూర్‌ జిల్లాలోని నర్మదా నదిపై ఈ బర్గి డ్యామ్‌ను నిర్మించారు&period; ఈ రిజర్వాయర్‌లో 29 మంది ప్రయాణికులు&period;&period; ఇద్దరు సిబ్బందితో వెళ్తున్న క్రూజ్‌ బోట్‌ తిరగబడింది&period; ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు&period; బలమైన గాలుల వల్ల రిజర్వాయర్‌లో నీరు కల్లోలంగా మారడాన్ని గుర్తించిన కొందరు ప్రయాణికులు పడవను వెనక్కి తిప్పాలని సిబ్బందిని కోరారు&period; అయితే&comma; వీరు చెప్పింది బోటు నడిపేవారికి వినిపించకపోవడంతో&period;&period; వారు అలాగే ముందుకెళ్లారని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; కొందరిని బోటు నుంచి రక్షించారు&period;కాగా&comma; ఈ ఘటనతో పలు నిర్వహణ లోపాలు బయటపడ్డాయి&period; ప్రయాణ సమయంలో సిబ్బంది ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని కొందరు ప్రయాణికులు తెలిపారు&period; ముందు ఇవ్వకుండా పడవ ముగినిపోతున్న సమయంలో లైఫ్‌ జాకెట్లు అందించారని ఆరోపించారు&period; ఈ ఘటనలో మిగతా వారికోసం గాలింపు కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..