అమెరికా అధ్యక్షడు ట్రంప్‌పై హత్యాయత్నం కలకలం రేపింది..

Advertisements

<p>అమెరికా అధ్యక్షడు ట్రంప్‌పై హత్యాయత్నం కలకలం రేపింది&period; వైట్‌హౌస్ ప్రెస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు&period; సుమారు 5 నుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపాడు&period; వెంటనే స్పందించిన సీక్రెట్‌ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్&comma; ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్&comma; విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు&period; వైట్‌హౌస్ ప్రెస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది&period; అధ్యక్షుడు ట్రంప్&comma; ప్రథమ మహిళ మెలానియా&comma; ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; ట్రంప్ ప్రసంగం కోసం అందరూ ఎదురుచూస్తున్న వేళ&comma; కోల్ అలెన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు&period; అతని వద్ద షాట్‌గన్&comma; హ్యాండ్‌గన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p>కాల్పుల శబ్దంతో వందలాది మంది జర్నలిస్టులు&comma; రాజకీయ నాయకులు&comma; ప్రభుత్వ అధికారులు భయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు&period; వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది&comma; వేదికపై ఉన్న డొనాల్డ్ ట్రంప్&comma; మెలానియా ట్రంప్‌లను సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు&period; ట్రంప్‌ను భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించే క్రమంలో ఆయన అదుపుతప్పి కిందపడిపోయారు&period; ఆయన కిందపడిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది&period; ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను సైతం భద్రతా సిబ్బంది పట్టుకుని లాక్కెళ్లారు&period; ఈ దాడిలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు బుల్లెట్ తగిలింది&period; అయితే&comma; బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించి ఉండటంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది&period; ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది&period; ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం నిందితుడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు&period; ఈ ఘటనపై స్పందించిన ట్రంప్&comma; తామంతా సురక్షితంగా ఉన్నామని తెలిపారు&period; ఒక భద్రతా అధికారికి గాయాలయ్యాయని&comma; బుల్లెట్‌ప్రూఫ్ వెస్ట్ కారణంగా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు&period; కాల్పులకు పాల్పడిన వ్యక్తిని సిక్ పర్సన్ అని ఆయన అభివర్ణించారు&period; ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది&period; మరోవైపు వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో జరిగిన కాల్పుల ఘటనపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు&period; ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని చంపడానికి కూడా వారు తెగించారు అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు&period; డొనాల్డ్ ట్రంప్&comma; సీనియర్ అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో జరిగిన దాడి ప్రమాదకరమైన ధోరణికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ లక్ష్యంగా వైట్‌హౌజ్ సమీపంలో జరిగిన హత్యాయత్నాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు&period; ప్రజాస్వామ్య దేశాల్లో హింసకు ఏమాత్రం చోటు లేదని ఆయన స్పష్టం చేశారు&period; వైట్‌హౌజ్ సమీపంలోని ఒక హోటల్‌లో &&num;8216&semi;కరస్పాండెంట్స్ డిన్నర్&&num;8217&semi; కార్యక్రమం జరుగుతుండగా గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడటం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది&period; ఈ ఘటనపై ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు&period; &&num;8220&semi;నా మిత్రుడు&comma; అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను&period; ఈ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను&period; ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు&period; ఆయన త్వరగా కోలుకోవాలని&comma; క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను&period; మా ఆలోచనలు&comma; ప్రార్థనలు ఆయన కుటుంబంతో&comma; అమెరికా ప్రజలతో ఉన్నాయి&&num;8221&semi; అని ప్రధాని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..